బన్నీని కౌగిట్లో బంధించిన స్నేహ రెడ్డి... ఫోటో వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది ఆదరణ సంపాదించుకున్నారు.ఈ సినిమా తర్వాత ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

 Sneha Reddy Caught The Bunny In The Cow... Photo Viral ,sneha Reddy, Bunny ,ico-TeluguStop.com

ఇక అల్లు అర్జున్ కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ఆయన సతీమణి స్నేహ రెడ్డికి కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్ కి మించిన ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఈ విధంగా స్నేహారెడ్డికి ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి గల కారణం ఆమె నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన క్యూట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.హీరోయిన్లతో సమానంగా డిజైనర్ దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.

అదేవిధంగా తన పిల్లలకి,అల్లు అర్జున్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమెకు అభిమానులు భారీగా పెరిగిపోయారు.

ఇక అల్లు కుటుంబంలో పెద్ద ఎత్తున ఈవెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈమె షేర్ చేస్తూ ఉంటారు.తాజాగా వీరంతా కలిసి సీక్రెట్స్ శాంటా సెలబ్రేషన్స్ జరుపుకున్న విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం అల్లూ ఫ్యామిలీ అంతా కూడా వెకేషన్ లో ఉన్నట్లు సమాచారం.ఈ వెకేషన్ లో భాగంగా స్నేహారెడ్డి బన్నీతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు.

బన్నీని తన కౌగిట్లో బంధించి స్నేహ రెడ్డి సెల్ఫీకి ఫోజులిచ్చారు.బన్నీ ఫేస్ కనబడకపోయినప్పటికీ ఆయన మాత్రం పుష్ప రాజ్ గెటప్ లో ఉన్నట్టు స్పష్టంగా అర్థం అవుతుంది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube