వైరల్.. ఆరేళ్లకే అదరగొట్టి ఇండియా బుక్ రికార్డుకెక్కిన బుడ్డోడు!

విజ్ఞానం అనేది వయసుతో సంబంధం లేనిదని తాజాగా ఒక ఆరేళ్ళ బుడ్డోడు నిరూపించాడు.అంత చిన్న వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కెక్కి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.

 Six-year-old From Tirupati Becomes Microsoft Office Specialist, Tirupati, Six-ye-TeluguStop.com

ఈ బాలుడు సాధించిన ఘనత చూసి ఎవ్వరైనా అతడిని మెచ్చుకోవాల్సిందే.అంత చిన్న వయసులోనే ఇంత పరిజ్ఞానం ఎలా సాధ్యం అనేది అందరికి అంతు చిక్కని ప్రశ్న.

ఆరేళ్ళ వయసులో ఎవరన్నా అల్లరి చేస్తూ ఆటపాటలతో తమ బాల్యాన్ని గడుపుతారు.ఎంత మందలించిన చదువు మీద ద్రుష్టి మరల్చలేరు.కానీ ఈ బుడ్డోడు మాత్రం తరగతి.కానీ మైక్రోసాఫ్ట్ స్పెషలిస్ట్ ఎక్సమ్ రాసి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.

ఐటి ప్రొఫెషన్స్ లో ఉండే వాళ్లకు కూడా కష్టమైన పరీక్షని ఆరేళ్ళ బుడ్డోడు రాసి విజయం కూడా సాధించాడు.

ఆ చిచ్చర పిడుగు పేరు రాజా అనిరుధ్ శ్రీరామ్.

వీరిది తిరుపతి.

Telugu India, Rajaanirudh, Tirupati-Latest News - Telugu

ఈ బుడ్డోడు సాకేత్ రామ్, అంజనా శ్రావణి ల కుమారుడు.ఇతడు ప్రస్తుతం రెండవ తరగతి చదువుతున్నాడు.అతడికి ఉన్న జ్ఞానంతో అతడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కెక్కాడు.

అతడు ఒక వైపు ఆన్ లైన్ క్లాసెస్ వింటూనే మరొక వైపు కంప్యూటర్ ముందు మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్ ప్రాక్టీస్ చేసేవాడట.

కరోనా కారణంగా కంప్యూటర్ లో ఆన్ లైన్ క్లాసెస్ వింటూనే ఖాళీ సమయాల్లో అదే కంప్యూటర్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు.

Telugu India, Rajaanirudh, Tirupati-Latest News - Telugu

ఈ బుడ్డోడు తల్లిదండ్రులు కూడా అతడి ఆసక్తి గుర్తించి అతడికి మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్ ప్రాక్టీస్ చేయడంలో హెల్ప్ చేసి అందులో అతడికి మెళుకువలు కూడా నేర్పించారు.ఆ తర్వాత టెస్ట్ రాసాడు.ఫస్ట్ సారి విజయం అందుకోలేకపోయాడు.కానీ రెండవసారి రాసిన టెస్టులో పాసయ్యాడు.అంతేకాదు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ సర్టిఫికెట్ కూడా పొందాడు.ఆ తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.

ఇంత చిన్న వయసులోనే ఈ ఘనతను సాధించడంతో అతడిని అందరు అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube