పెళ్లిలో సైలెంట్ బరాత్.. హెడ్‌ఫోన్స్ ధరించి డ్యాన్స్, వీడియో వైరల్

పెళ్లి వేడుకలలో( Wedding Celebrations ) ఒక ముఖ్య భాగమైన బరాత్ ఎంత సందడిగా జరుగుతుందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.మామూలుగా బరాత్ ఊరేగింపులో చెవులు చిల్లులు పడేలా సంగీతం పెట్టి, వధూవరుల కుటుంబ సభ్యులు డ్యాన్సులు వేస్తుంటారు.

 Silent Baraat Seen On Road As People Wear Headphones To Dance On Street,silent B-TeluguStop.com

కొన్నిసార్లు ఈ సౌండ్ సిస్టమ్‌ శబ్దం స్థానికులకు ఒక డిస్టర్బెన్స్ గా కూడా మారుతుంది.వాతావరణంలో శబ్ద కాలుష్యాన్ని( Sound Pollution ) పెంచుతుంది.

అయినా ఒకరి జీవితంలో పెళ్లి ఒకేసారి వస్తుంది కాబట్టి చాలామంది ఈ వేడుకలకు అభ్యంతరం చెప్పకుండా సర్దుకుపోతారు.అయితే ఇప్పటిదాకా ఇలా మ్యూజిక్ తో వణికించిన బరాత్( Marriage Baarat ) వేడుకలు ఒక పెళ్లిలో మాత్రం మూగపోయాయి.

అయితే అది కేవలం స్థానికులకు మాత్రమే.ఈ పెళ్లికి వచ్చిన వధూవరులు మాత్రం హెడ్‌ఫోన్స్( Headphones ) పెట్టుకుని సౌండ్ సిస్టమ్‌కి మించిన అనుభూతిని పొందారు.అంతేకాదు సైలెంట్ గా డ్యాన్సులు వేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు.దీనికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌( Instagram Video )లో వైరల్ గా మారింది ఇది చూసి చాలామంది ఇంప్రెస్స్‌ అవ్వగా మరికొంత మంది మాత్రం ఇలా చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పార్టీ ఎంజాయ్ చేస్తే కిక్కు రాదని అన్నారు.

అయినా కూడా దీనివల్ల వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుందని వారిని ప్రశంసించారు.డీజే సిస్టమ్‌( DJ Systems )లకు వెచ్చించే డబ్బులను హెడ్ ఫోన్స్ కి ఖర్చు చేయడం చాలా తెలివైన నిర్ణయం అని మరికొందరి పేర్కొన్నారు.ఈ సైలెంట్ ఏజ్ బరాత్‌కు మరి కొంతమంది ఫిదా అయ్యారు.@shefoodie ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన వీడియోకు ఇప్పటికే ఎనిమిది లక్షల దాకా లైక్‌లు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube