యూటర్న్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అందాల భామ శ్రద్ధాశ్రీనాథ్.ఈ అమ్మడు మొదటి సినిమానే విభిన్నమైన కథాంశంతో సినిమా చేసి హిట్ కొట్టింది.
తరువాత కోలీవుడ్ లో కూడా విక్రమ్ వేధా సినిమాలో డీగ్లామర్ పాత్రతోనే అడుగుపెట్టింది.అలాగే టాలీవుడ్ లో కూడా జెర్సీ సినిమాలో నేచురల్ స్టార్ నాని వైఫ్ గా బిడ్డ తల్లిగా యూనిక్ పాత్రలో ఎంట్రీ ఇచ్చింది.
సౌత్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి ప్రయత్నంలోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ అలాంటి పాత్రలకె పనికొస్తుందని దర్శక, నిర్మాతలు కూడా ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు.ఈ కారణంగా ఈ భామకి సెట్ అయ్యే పాత్రలు దొరికితేనే దర్శకులు పిలిచి అవకాశం ఇస్తున్నారు.
దీంతో అనుకున్న స్థాయిలో శ్రద్ధ కెరియర్ వేగం పుంజుకోలేదు.మంచి సినిమాలు చేస్తున్న ఎక్కువ సినిమాలు చేసే అవకాశం రావడం లేదు.
తెలుగులో అయితే గ్లామర్ హీరోయిన్లుకే కమర్షియల్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.రష్మిక మందన,పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి అందాల భామలు కమర్షియల్ స్టార్ హీరోయిన్స్ అయ్యారంటే కేవలం గ్లామర్ పాత్రలకి వారు రెడీగా ఉండటమే కారణం.
ఈ నేపధ్యంలో శ్రద్ధా శ్రీనాథ్ తన కెరియర్ వేగం పెంచుకోవడానికి టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా ఎదగడానికి గ్లామర్ పాత్రలు చేయడానికి అయినా రెడీగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.అందుకోసం గ్లామర్ ఫోటో షూట్ లకి ప్రాధాన్యత ఇస్తూ వాటితో దర్శక, నిర్మాతల దృష్టిలో పడేందుకు ప్రయత్నం చేస్తుంది.
మరి శ్రద్ధా కెరియర్ మరింత శ్రద్ధగా సాగడానికి స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన ఒక్క కమర్షియల్ సినిమా అయినా పడుతుందేమో చూడాలి.