షాకింగ్.. టమాటాలను దొంగలించకుండా బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి

దేశవ్యాప్తంగా టమాటా( Tomato ) ధరలు కొండెక్కుతున్నాయి.ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి.ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేజీ టామాటా రూ.100కిపైగా పలుకుతోంది.కొన్ని రాష్ట్రాల్లో అయితే రూ.180 వరకు చేరుకుంది.టామాటా ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.దీంతో చాలామంది కూరల్లో టమాటాలను వాడటం మనేశారు.టమాటాలకు ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాలను ఉపయోగిస్తున్నారు.

 Shocking Trader Hired Bouncers To Avoid Stealing Tomatoes , Latest News, Viral-TeluguStop.com
Telugu Bouncers, Latest, Avoid, Tomatoes, Trader, Hired-Latest News - Telugu

అయితే టమాటా ధరలు పెరగడంతో వాటిని చోరీ చేసేందుకు దోంగలు ప్రయత్నాలు చేస్తున్నారు.

టామాటా తోటల్లోకి చొరబడి ఎత్తుకెళ్లిపోతున్నారు.అలాగే టమాటా షాపుల నుంచి దొంగలిస్తున్నారు.

దీంతో ఒక వ్యాపారి టమాటాలకు ఏకంగా బౌన్సర్ల( Bouncers )తో భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు.వారణాసిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన కూరగాయాల వ్యాపారి తన షాపుకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.టామాటా ధరలు పెరగడంతో షాపుకు వచ్చే కొంతమంది టామాటాలను దొంగచాటుగా ఎత్తుకెళ్లిపోతున్నారని, అలాగే కొంతమంది గొడవలు పడుతున్నారని షాపు యజమాని అజయ్ ఫాజి చెప్పాడు.

Telugu Bouncers, Latest, Avoid, Tomatoes, Trader, Hired-Latest News - Telugu

కస్టమర్లతో గొడవలు పడటం ఇష్టం లేకనే బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నట్లు ఫౌజి తెలిపాడు.కూరగాయల షాపు ముందు బౌన్సర్లు కాపలా కాస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో కూరగాయల షాపుకు సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే ప్రస్తుతం కిలో టమాటా రూ.160 పలుకుతుందని వ్యాపారి ఫౌజీ చెబుతున్నాడు.అంత వెచ్చింది కూరగాయలు కొనలేక కొంతమంది 50, 100 గ్రామాలను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపాడు.

సాధారణంగా కొంతమంది సెలబ్రెటీలు తమకు సెక్యూరిటీ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటారు.అలాగే పబ్‌ల ముందు కూడా బౌన్సర్లు ఉంటారు.కానీ కూరగాయల షాపు ముందు కూడా ఉండటం ఆశ్చర్యకరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube