తెలంగాణలో ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది.వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు.ఉదయం జిమ్ కి వెళ్లి వచ్చిన శ్రీధర్ అనే యువకుడు అస్వస్థతకు గురయ్యారు.
కుటుంబ సభ్యులు ఆయనను వెంటే ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు.మృతుని తండ్రి కాంగ్రెస్ నేత మానుకొండ రాధాకిశోర్ అని తెలుస్తోంది.
శ్రీధర్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది.







