అమెరికా భారతీయుల దెబ్బకి వణుకుతోంది.అందుకే ట్రంప్ లాంటి ఒక మూర్ఖపు వ్యక్తికి అధ్యక్ష ఫీటాన్ని కట్టబెట్టింది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక కావడానికై ప్రధాన కారణం అక్కడ ఉండే నిరుద్యోగులు యువతే ఎందుకంటే స్వదేశంలో ఉద్యోగాలు విదేశీయులు దొబ్బుకు పోతున్నారు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి యువత ఆకర్షింప పడ్డారు.దాంతో తప్పకుండా ఈ హామీ నెరవేర్చుతాడు అంటూ ట్రంప్ ని గెలిపించారు అందుకు తగ్గట్టుగానే ట్రంప్ ఎన్నారైల ఉద్యోగాలని ఊడగొట్టడానికి చేసిన ప్రయత్నమే ఈ హెచ్ -1బీ వీసా నిభందనలు.
విదేశాల నుంచీ వచ్చే వారిలో అధికభాగం భారతీయులు కావడంతో వారిపైనే ఎక్కువగా జాత్యహంకార దాడులు జరిగాయి అనేది వాస్తవం.అయితే ఈ సమయంలో ట్రంప్ ప్రవేసపెట్టిన నిభందనలు భారతీయుల ఉద్యోగాల పై తీవ్రమైన ప్రభావం చూపేలా ఉన్నాయి…ఇప్పటికే ఎంతో మంది భారతీయులు అమెరికా వెళ్ళాలంటే వెనకడుగు వేస్తున్నారు కూడా అయితే అక్కడే వీసా పొంది ఉంటున్న వారిని కూడా సాగనంపాలని తాజాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా రెన్యువల్ సమయంలో ఎక్కడ తప్పులు దొరుకుతాయో అంటూ ఎంతో తీక్షణంగా పరిశీలించి వారిలో చాలా మందిని సైతం సాగనంపడానికి సర్వం సిద్దం చేస్తున్నారట.
హెచ్-1బీ వీసా కింద అమెరికాకు వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న వారికి ఇటీవల ఇమ్మిగ్రేషన్ విభాగం నుంచి నోటీసులు అందుతున్నాయి “అమెరికాలో చేసే ఉద్యోగానికి సరిపోయే స్థాయిలో తగిన అర్హతలు మీకున్నాయా”.? “మీది ప్రత్యేకమైన ప్రతిభాపాటవాలు అవసరమైన ఉద్యోగమా?’’ వంటి ప్రశ్నలుఅ తిక్క తిక్క ప్రశ్నలతో ఇమ్మిగ్రేషన్ వేధిస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నారైలు వీసాదారుల పొడిగింపు దరఖాస్తుల్లో చిన్న తప్పు దొర్లినా తీవ్ర పర్యవసానాలు ఉంటాయి.అవసరమైన సర్టిఫికెట్లు, సాక్ష్యాధార పత్రాలు లేని దరఖాస్తుదారులపై వేటు పడుతుందనీ అవసరం అనుకుంటే కటినమైన చర్యలు కూడా చేపడుతామని హెచ్చరికలు చేస్తున్నారట.