నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.బింబిసార సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్నా డెవిల్( Devil ) సినిమాతో ఈ హీరోకు పూర్వ వైభవం వస్తుందని ఫ్యాన్స్ భావించారు.
అయితే డెవిల్ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటన వెలువడటం గమనార్హం.
ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో కూడా క్లారిటీ లేదు.అయితే డెవిల్ వాయిదా పడటానికి ముందే అదే తేదీకి ఆదికేశవ పోస్ట్ పోన్ అయినట్టు అధికారిక ప్రకటన వచ్చింది.క్రికెట్ మ్యాచ్ ల వల్ల ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం కొసమెరపు.
మరోవైపు నాయట్టు సినిమాకు ఫ్రీమేక్ గా తెరకెక్కుతున్న కోటబొమ్మాళి( Kotabommali ) పీఎస్ మూవీ కూడా అదే తేదీన రిలీజ్ కానుందని తెలుస్తోంది.ఈ విషయాలు తెలిసిన కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ ను తొక్కేస్తున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
కళ్యాణ్ రామ్ సినిమాల విషయంలోనే ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది.వాస్తవానికి కళ్యాణ్ రామ్ బింబిసార2 ( Bimbisara 2 )సినిమాను కూడా మొదలుపెట్టాల్సి ఉన్నా కొన్ని కారణాల ఈ నిర్ణయం విషయంలో మార్పు జరిగిందని సమాచారం అందుతోంది.
వశిష్ట ప్రస్తుతం చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్నారు.
కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిర్మించిన పలు సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.డెవిల్ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.కళ్యాణ్ రామ్ సినిమాలు వాయిదా పడటం వల్ల సినిమాపై అంచనాలు తగ్గే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉండటం గమనార్హం.