డైనోసార్ కాస్ట్యూమ్స్‌తో రోడ్డుపైకి వచ్చిన వందలమంది.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

ఈ భూమిపై చాలా ఏళ్ల క్రితం భవనాల కంటే ఎత్తైన డైనోసార్లు( Dinosaurs ) నివసించాయి.శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

 People Dressed In Dinosaur Costumes Raid City Details, Viral News, Latest News,-TeluguStop.com

అంత పెద్ద జంతువులు తిరుగుతూ ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి.డైనోసార్లు ఎగురుతూ, పరిగెడుతూ, నడుస్తూ ఎక్కడ చూసినా అప్పట్లో అవే కనిపించేవి.

అయితే నేటి కాలంలో డైనోసార్‌లు వస్తే ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో చూపించడానికి జురాసిక్ పార్కులు( Jurassic Park ) సినిమాల్లో చూపించారు.అయితే తాజాగా ఒక ప్రాంతంలో డైనోసార్ కాస్ట్యూమ్స్‌తో( Dinosaur Costumes ) రోడ్డుపైకి వందలమంది వచ్చారు.

వాటిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.ఆ వీడియో మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో డైనోసార్లు రోడ్డుపై నడుస్తున్నట్లు కనిపిస్తాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి నిజమైన డైనోసార్‌లు కావు, కానీ ఫ్యాన్సీ డ్రెస్‌లు ధరించిన వ్యక్తులు.@Enezator అనే ట్విట్టర్ ఖాతా షేర్ చేసిన ఈ వీడియో డైనోసార్లు రోడ్డుపై నడుస్తున్నట్లు చూపిస్తుంది.ఈ డైనోసార్లన్నీ అండర్ గ్రౌండ్ ద్వారా( Underground ) బయటకు వచ్చి నడవడం ప్రారంభిస్తాయి.ఈ గ్రే కలర్ కాస్ట్యూమ్స్ కాస్త రియల్ గా ఉండటం వల్ల మొదటిగా చూసినవారు ఉలిక్కిపడక తప్పదు.

ఆ తర్వాత వారు మనుషులని మెల్లిగా అర్థం అవుతుంది.

వీడియోలో గమనించినట్లు అండర్‌గ్రౌండ్‌ రోడ్డు నుంచి బయటకు రాగానే జనం కాసేపు బిక్కుబిక్కుమంటున్నారు.వాళ్ళని భయంతో చూడటం మొదలు పెట్టిన స్థానికులు ఆపై వాళ్ళని వీడియో తీయడం మొదలు పెడతారు.ఆ డైనోసార్‌లను చూసేందుకు అక్కడ చాలా మంది గుమిగూడటం మీరు చూడవచ్చు.

కొంతమంది అరుపులు కూడా వినవచ్చు.ఈ వీడియోకు 67 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఈ దృశ్యం చూసేందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందని కొందరు కామెంట్లు చేశారు.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube