టంగుటూరి ప్రకాశం పంతులు( Tanguturi Prakasam Pantulu ) ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అనే సంగతి తెలిసిందే.స్వాతంత్ర సమరయోధుడు అయిన ప్రకాశం పంతులు స్వాతంత్రోద్యమ పోరాటం కోసం తన యావదాస్తిని ఖర్చు చేశారు.
కటిక పేదరికంతో జీవితాన్ని మొదలుపెట్టిన ప్రకాశం పంతులు బారిష్టర్ చదివి బాగా డబ్బులు సంపాదించి చివరి రోజుల్లో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డారు.
ప్రముఖ సినీ గేయ రచయితలలో ఒకరైన టంగుటూరి వెంకట రామదాస్( Tanguturi Venkata Ramdas ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు గొప్ప లాయర్( great lawyer ) అని చెప్పారు.
ప్రకాశం పంతులు న్యాయవాదిగా పని చేసే సమయంలో ధనవంతుల దగ్గర మాత్రమే డబ్బులు తీసుకునేవారని లేని వాళ్ల దగ్గర రూపాయి కూడా తీసుకునే వారు కాదని ఆయన కామెంట్లు చేశారు.తన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినా కేసుకే ప్రకాశం పంతులు ప్రాధాన్యత ఇచ్చారని వెంకట రామదాస్ అన్నారు.
ఆ సమయంలో ప్రకాశం పంతులు చనిపోయిన వాళ్లను ఎలాగో తీసుకొనిరాలేమని కేసు ఓడిపోతే వీరి జీవితం అన్యాయం అయిపోతుందని చెప్పారని ఆయన కామెంట్లు చేశారు.అంత నిస్వార్థంగా బ్రతికిన ప్రకాశం పంతులు చివరి రోజుల్లో తినడానికి తిండి లేని పరిస్థితిని అనుభవించారని వెంకట రామదాస్ తెలిపారు.కటిక దరిద్రంలో ప్రకాశం పంతులు ప్రాణాలు విడిచారని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రకాశం పంతులు కోసం ఎవరైనా పూలను తెస్తే వాటికి బదులుగా అరడజను అరటి పండ్లను తెచ్చి ఉంటే తినేవాడిని కదా అని అన్నారని వెంకట రామదాస్ కామెంట్లు చేశారు.మితిమీరిన జాలి, దయాగుణం వల్లే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని వెంకట రామదాస్ పేర్కొన్నారు.బీరువాలో ఎంతుంటే అంత తీసిచ్చేవారని అలా సంపాదించింది పోయిందని ఆయన కామెంట్లు చేశారు.
టంగుటూరి ప్రకాశం పంతులు అనుభవించిన కష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.