రాయలసీమ( Rayalaseema ) అంటే రత్నాలసీమ అని అందరికీ తెలిసిందే.శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలను( Diamonds ) రాశులుగా పోసి అమ్మేవారు అని కథలు కథలుగా చెప్పడం అందరూ వినే ఉంటారు.
కాబట్టి కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఇంకా వజ్రాలు దాగి ఉన్నాయని అందరికీ తెలిసిందే.
ఎందుకంటే తొలకరి చినుకులు కురిసిన సమయంలో ఈ ప్రాంతాలలో వజ్రాల వేట మొదలవుతుంది.
సాధారణంగా తొలకరి చినుకులు కురిస్తే రైతులు ( Farmers ) పొలాన్ని వ్యవసాయం చేసేందుకు తయారుచేస్తారు.కానీ అనంతపురం, కర్నూలు జిల్లాల మధ్యలో ఉండే ప్రాంతాలలో మాత్రం వజ్రాల వేట మొదలవుతుంది.
కేవలం ఈ ప్రాంత ప్రజలే కాదు చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుండి ప్రజలు వందల సంఖ్యలో వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.మద్దికెర ప్రాంతం వజ్రాల వేటకు పునాది.
ప్రతి సంవత్సరం తొలకరి చినుకులు కురిసిన వెంటనే మద్దికెర ప్రాంతానికి ఎక్కడెక్కడి నుండో ప్రజలు వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు.
ఇక కాస్త విలువైన రాయి కనిపిస్తే చాలు అక్కడ కొనేందుకు సిద్ధంగా ఉన్న వజ్రాల వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తారు.ఈ సంవత్సరం మద్దికెర మండలంలోని బసినేపల్లి లో ఉండే ఓ రైతుకు అదృష్టం తలుపు తట్టింది.
ఈ సంవత్సరం కురిసిన తొలకరి చినుకులు ఆ రైతు తలరాతనే మార్చేశాయి.ఆ రైతుకు ఓ వజ్రం దొరికింది.వెంటనే ఆ వజ్రంతో వ్యాపారుల దగ్గరికి పరుగులు పెట్టాడు.వ్యాపారులు ఆ వజ్రాన్ని పరిశీలించి ధర రూ.2 కోట్లు గా నిర్ణయించారు.ఈ విషయం కాస్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.ఇక స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వందల సంఖ్యలో ప్రజలు వజ్రాల వేటను ముమ్మరం చేశారు.