నిహారిక విడాకుల గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. మగాడి మైండ్ సెట్ సమస్య అంటూ?

మెగా డాటర్ నిహారిక( Niharika ) గురించి ప్రేక్షకులకు, నెటిజన్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నిహారిక తన భర్త చైతన్య( Chaitanya Jv )తో విడాకులు తీసుకోగా ఆమె ఎందుకు విడాకులు తీసుకుందనే ప్రశ్నకు సంబంధించిన సమాధానం మెగా ఫ్యాన్స్ కు సైతం తెలియదు.

 Shocking Facts About Niharika Divorce Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

అయితే నాగబాబు( Naga Babu ) నిహారిక పేరు ప్రస్తావించకపోయినా నిహారిక విడాకుల గురించి పరోక్షంగా క్లారిటీ ఇవ్వగా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మగవాడు ఒక మైండ్ సెట్ నుంచి పూర్తిగా డెవలప్ అవ్వలేదని ఆడపిల్లలు రెబల్ యాటిట్యూడ్స్ తో ఉంటున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు.

ఆడపిల్లలకు నేను ఎందుకు అమ్మలా, ఇతర పెద్దవాళ్లలా అడ్జస్ట్ అవ్వాలనే ప్రశ్న వస్తోందని ఆయన కామెంట్లు చేశారు.డామినేట్ చేసి అధికారం చలాయించే హక్కు భర్తకు లేదని అమ్మాయిలు ఫీలవుతున్నారని నాగబాబు వెల్లడించడం గమనార్హం.

Telugu Chaitanya Jv, Naga Babu, Niharika, Tollywood, Varun Tej-Movie

భార్యలను కంట్రోల్ చేయాలని భర్తలు ప్రయత్నిస్తున్న సమయంలోనే బ్రేకప్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన కామెంట్లు చేశారు.నేను ఇండిపెండెంట్ అని నాకు నేను సంపాదించుకుంటున్నా అని అమ్మాయిలు సైతం అనుకుంటున్నారని నాగబాబు కామెంట్లు చేశారు.బ్రేకప్స్ కావడానికి మగవాడే కారణమని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.నాగబాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Chaitanya Jv, Naga Babu, Niharika, Tollywood, Varun Tej-Movie

నిహారిక విడాకులు తీసుకున్నా విడాకుల విషయంలో నాగబాబు నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తోందని సమాచారం అందుతోంది.నిహారిక సైతం కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.వ్యక్తిగత జీవితం గురించి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి రియాక్ట్ కావడానికి నిహారిక పెద్దగా ఆసక్తి చూపడం లేదు.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే నిహారిక సక్సెస్ ట్రాక్ లోకి రావడం కష్టం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒకవైపు నటిగా, మరోవైపు నిర్మాతగా నిహారిక రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube