టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ఎవరేం అనుకున్నా తనకు నచ్చిన విధంగా ఉండటానికి ఇష్టపడతారు.సోషల్ మీడియాలో బాలయ్య యాక్టివ్ గా ఉండకపోయినా సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్లను మాత్రం ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి ఇష్టపడతారు.
ఫేస్ బుక్ లో బాలయ్య యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.ఏకంగా 10 లక్షల మంది బాలయ్యను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు .
సోషల్ మీడియాలో బాలయ్య ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది.అయితే తనను పది లక్షల మంది ఫాలో అయినా బాలయ్య మాత్రం కేవలం మూడు అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నారు.
ఆ మూడు అకౌంట్లలో సిల్లీ మోంక్స్ ఎంటర్టైన్మెంట్ అకౌంట్ ఒకటి కాగా హోమ్ బ్యానర్ అయిన ఎన్బీకే ఫిల్మ్స్ ను సైతం బాలయ్య ఫాలో అవుతున్నారు.ఈ రెండు అకౌంట్లతో పాటు బాలయ్య ఫ్యాన్స్ వెబ్ సైట్ అయిన మనబాలయ్య.
కామ్ ను కూడా ఫాలో అవుతున్నారు.

సోషల్ మీడియాపై బాలయ్య ప్రధానంగా దృష్టి పెడితే ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.బాలయ్య తన సినిమాలకు సంబంధించిన కొత్త విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తుండగా గడిచిన మూడు దశాబ్దాలుగా హ్యాట్రిక్ సాధించని బాలయ్య అనిల్ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆ రికార్డ్ సొంతమయ్యే అవకాశం ఉంది.

దర్శకుల ఎంపికలో బాలయ్య సెలెక్షన్ అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య రెమ్యునరేషన్ త్వరలో 25 కోట్ల రూపాయల రేంజ్ కు పెరగనుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.బాలయ్య తన సినిమాలు ఫ్లాపైన సమయంలో నిర్మాతలకు డబ్బులు వెనక్కు ఇచ్చిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.ఈ విషయాలను వెల్లడించడానికి బాలయ్య ఎక్కువగా ఇష్టపడరని తెలుస్తోంది.