అక్కతో పోల్చితే చెల్లి చాలా బెటర్‌.. దొరసాని తెలివైన ఎంపిక

Shivathmika Is Best Than Shivani Rajashekhar ,Rajasekhar ,shivathmika, Shivani Rajashekhar, Dorasani Movie

స్టార్ హీరో రాజశేఖర్( Rajasekhar ) ఇద్దరు కుమార్తెలు శివాని ( Shivani )మరియు శివాత్మిక( Shivatmika ) హీరోయిన్స్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే.శివాని కంటే ముందు చిన్నమ్మాయి అయినా శివాత్మిక దొరసాని చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Shivathmika Is Best Than Shivani Rajashekhar ,rajasekhar ,shivathmika, Shivani R-TeluguStop.com

శివాత్మిక దొరసాని చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.అయితే నటిగా మాత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది అనడంలో సందేహం లేదు.

తండ్రి మరియు తల్లికి తగ్గ కూతురు అంటూ శివాత్మికకు పేరు దక్కింది.ఆ తర్వాత కొన్నాళ్లకు శివాని కూడా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే శివాత్మిక కు దక్కినట్లుగా శివానికి ఆఫర్లు రావడం లేదు, అలాగే గుర్తింపు కూడా రాలేదు.ఇప్పటి వరకు శివాని ఏ ఒక్క సినిమా తో ప్రేక్షకుల్లో నోటెడ్‌ అవ్వలేక పోయింది.

అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా శివాత్మిక ను గుర్తు పట్టుతారు, కానీ శివాని విషయంలో కొందరు మాస్ ఆడియన్స్ గుర్తు పట్టే పరిస్థితి లేదు అయినా కూడా శివాని ప్రతిభ కు కొదవలేదు.

Telugu Dorasani, Rajashekhar, Shivani, Shivatmika, Telugu, Tollywood-Movie

చెల్లికి తగ్గట్లుగానే అక్క కూడా బెస్ట్ నటి మరియు అందం విషయంలో బెస్ట్ అనిపించింది.కానీ రావాల్సిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆకట్టుకునే ఫిజిక్ ఇద్దరి సొంతం అయినా కూడా ఏ ఒక్క స్టార్ హీరో కూడా వీరిని పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి, అవకాశాలు దక్కించుకునే విషయంలో అక్క శివానితో పోలిస్తే చెల్లి శివాత్మిక బెస్ట్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకోలేక పోయినా కూడా శివాత్మిక ముందు ముందు టాలీవుడ్ లో మంచి పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Telugu Dorasani, Rajashekhar, Shivani, Shivatmika, Telugu, Tollywood-Movie

స్టార్ హీరోయిన్‌ అనే ట్యాగ్ సొంతం చేసుకోలేక పోయినా కచ్చితంగా ఒక మంచి నటి అనే అభిప్రాయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ విశ్లేషకుల అభిప్రాయం చేస్తున్నారు.అందుకే శివాని కంటే శివాత్మిక బెటర్ అనే అభిప్రాయానికి చాలా మంది వస్తున్నారు.అయితే ముందు ముందు శివాని కూడా మంచి పాత్రలో నటించే అవకాశాలు లేకపోలేదని ఆమె సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube