గన్నవరం పై షర్మిల కన్ను .. ఆ వైసీపీ నేత తో మంతనాలు

పూర్తిగా వైసిపి నే టార్గెట్ చేసుకున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పార్టీలో చేరికల జోరు పెంచేందుకు సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగానే వైసీపీలోని అసంతృప్త నేతలను గుర్తించి వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా మంతనాలు చేస్తున్నారు.

 Sharmila's Eye On Gannavaram Talks With That Ycp Leader, Dutta Ramachandrarao,-TeluguStop.com

ఇటీవలే విశాఖ జిల్లా కీలక నేత కొణతాల రామకృష్ణతో మంతనాలు చేసిన షర్మిల తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ కీలక నేత దుట్టా రామచంద్ర రావు( Dutta Ramachandra Rao ) తో భేటీ అయ్యారు.కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

షర్మిల వెంట కాంగ్రెస్ కీలక నేతలు రఘువీరారెడ్డి,  పల్లంరాజు,  గిడుగు రుద్రరాజు,  దుట్టా ఇంటికి నిన్ననే వెళ్లారు .కాంగ్రెస్ లో చేరాల్సిందిగా వారంతా కోరారు.దుట్టా కూడా దీనికి అంగీకరించినట్లుగా షర్మిల ప్రకటించారు.అయితే తాను కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానని షర్మిలకు దుట్టా చెప్పారట.

Telugu Ap, Congress, Gannavaram, Jagan, Konathalarama, Ysrcp-Politics

 గత కొంతకాలంగా గన్నవరం( Gannavaram ) వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై దుట్ట రామచందర్రావు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో రాంచందర్రావు పోటీ చేశారు.2019 ఎన్నికల్లో యర్లగడ్డ వెంకట్రావు కు ఆ స్థానాన్ని ఇచ్చారు .ఆయన ఓటమి చెందడంతో టిడిపి నుంచి గెలిచిన వంశీ ని  వైసిపికి మద్దతుదారుడుగా చేసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో వంశీకే టికెట్ ఇచ్చే ఆలోచనతో జగన్ ఉండడం, ఆయనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరిపోగా , దుట్టా  రామచంద్రరావు సైతం గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు.

Telugu Ap, Congress, Gannavaram, Jagan, Konathalarama, Ysrcp-Politics

 ఈ క్రమంలోనే ఆయన అసంతృప్తిని గుర్తించిన షర్మిల కాంగ్రెస్ లో చేరాల్సిందిగా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరి ఆహ్వానం పలికారు.మొదటి నుంచి వైసీపీ అధినేత జగన్ కు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచినా,  జగన్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మధ్యలో వచ్చి చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని,  వంశీ కూడా వైసిపి నేతలని టార్గెట్ చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తూ,  కేసులు పెట్టిస్తున్నారని ఈ విషయాన్ని అనేకసార్లు జగన్  దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని దుట్టా రామచంద్ర రావు చెబుతున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube