ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న షణ్ముఖ్ జశ్వంత్.. ఏం జరిగిందంటే?

షణ్ముఖ జశ్వంత్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.యూట్యూబ్ స్టార్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకొని వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.

 Shanmukh Jaswanth Suffers With Dental Problem, Shanmukh Jaswanth , Dental Proble-TeluguStop.com

ఈ విధంగా వెబ్ సిరీస్ ద్వారా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.ఈ క్రమంలోనే దీప్తి సునయనతో కలిసి ఎన్నో వీడియోలలో నటించిన షణ్ముఖ్, సునయన మధ్య ప్రేమాయణం సాగుతోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే దీప్తి సునయన విషయంలో కూడా షణ్ముఖ్ జశ్వంత్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుంటారు.ఇకపోతే ఫుల్లుగా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ కి గురికావడంతో షణ్ముఖ్ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాడు.

అప్పుడు వచ్చిన పాపులారిటీ కారణంగానే తనకు బిగ్ బాస్ అవకాశం వచ్చిందని పలువురు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే గత సీజన్లలో పాల్గొనడం కోసం నిర్వాహకులు జశ్వంత్ ను సంప్రదించారని అయితే ఈ సీజన్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

Telugu Problem, Problems-Movie

ఇదిలా ఉండగా షణ్ముఖ్ తాజాగా తన ఆరోగ్య సమస్యలను గురించి వివరించారు.తనకు తీవ్రమైన దంత సమస్య ఉందని గత నాలుగు నెలలో రెండు సార్లు ఇంప్లాంట్స్ జరిగాయని అది ఎంతో నొప్పిగా ఉంటుందని తెలిపారు.ఈ నొప్పి కారణంగా తనకు దవడ మొత్తం బాగా వాచి పోయిందని,ఓరో కేర్ డెంటర్ క్లినిక్ వల్ల చాలా తొందరగా రికవరీ అయినట్లు చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే తను ఆ క్లినిక్ కి ప్రమోషన్ చేయలేదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా షణ్ముఖ్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube