బైక్‌లను ఢీకొడుతూ బీభత్సం సృష్టించిన కారు.. షాకింగ్ వీడియో వైరల్

తాజాగా బెంగళూరులో( Bangalore ) జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.డాష్‌క్యామ్ ద్వారా రికార్డ్ అయిన ఈ వీడియోలో రెండు బైక్‌లను ఎస్‌యూవీ కారు( SUV ) ఢీ కొట్టి అలానే ముందుకు వెళ్లిపోవడం కనిపించింది.

 Several People Injured After Suv Hits Three Bikes In Bengaluru Details, Suv Driv-TeluguStop.com

ఢీ కొట్టిన తర్వాత అక్కడ నుంచి కారు డ్రైవర్ పరారయ్యాడు.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్లు తెలిసింది.

ఈ సంఘటన ఆదివారం బెంగళూరులోని దక్షిణ ప్రాంతంలోని కాలేన అగ్రహార నివాస ప్రాంతం సమీపంలో జరిగింది.

ఎస్‌యూవీ డ్రైవర్ అభిషేక్ అగర్వాల్( Abhishek Agarwal ) వాహనంపై నియంత్రణ తప్పి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కిరణ్, జస్మిత, బసంత్ అనే బైక్ రైడర్లను ఢీకొట్టాడు.కిరణ్ బైక్‌పై నుంచి దూకి కిందపడగా, జస్మిత, బసంత్‌లు బైక్‌పై నుంచి కిందపడిపోయారు.బాధితులను ఆదుకునేందుకు ఎస్‌యూవీ డ్రైవర్‌ ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు.

హుళిమావు ట్రాఫిక్ పోలీసులు( Hulimavu Traffic Police ) ఎస్‌యూవీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, కారు డాష్‌క్యామ్‌లో ప్రమాదానికి సంబంధించిన వీడియో పట్టుకున్నట్లు తెలిపారు.బాధితులకు స్వల్ప గాయాలయ్యాయని, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి సంబంధించిన వీడియోను నబీలా జమాల్ అనే ట్విట్టర్ యూజర్ సోమవారం ఉదయం షేర్ చేశారు.ఎస్‌యూవీ డ్రైవర్ నిర్లక్ష్య, అమానవీయ ప్రవర్తనను ఖండించారు నెటిజన్లు.డ్రైవరు మద్యం తాగి ఉండొచ్చని కొందరు ఊహిస్తే, మరికొందరు ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలను బెంగళూరులో పాటించేవారు చాలా తక్కువ అని మరికొందరు అన్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube