లవ్ సీక్రెట్స్ అన్నీ రివీల్ చేసిన చలపతి రావు.. మాములుగా లేవుగా!

వెండి తెరపై గత కొన్ని దశాబ్దాల నుంచి అద్భుతమైన పాత్రలో నటిస్తూ ఎంతో మంది హీరోల సినిమాలలో నటించిన సీనియర్ నటుడు చలపతిరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందిన చలపతిరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 Senior Actor Chalapathi Rao Open On His Love Story And Habits Chalapathi Rao Wif-TeluguStop.com

ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితం ఎలా సాగింది తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను, తన ప్రేమ గురించి అన్ని బయటపెట్టారు.

చలపతిరావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తన లవ్ సీక్రెట్ బయటపెట్టారు.

తనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిందని అప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పుకున్నానని, మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేఖలు లేవు.కేవలం తను నాకు ప్రేమను వ్యక్త పరిచిన వారంలోగా బెజవాడలో స్నేహితులు అందరూ కలిసి మాకు పెళ్లి చేశారని తన ప్రేమ పెళ్లి గురించి తెలియజేశారు.

Telugu Chalapathi Rao, Habits, Interview, Love Store-Movie

అయితే తన భార్య ఎంతో ధైర్యవంతురాలని ఏకంగా ఎన్టీరామారావు దగ్గరికి వెళ్లి ఎందుకు మా ఆయనకు మంచి పాత్రలు ఇవ్వరని ప్రశ్నించారనీ ఈ సందర్భంగా చలపతిరావు తన భార్య గడుసుతనం గురించి తెలియజేశారు.జీవితంలో మందు సిగరెట్ వంటి వ్యసనాలను ఎప్పుడు ముట్టుకోని తన భార్యకు మాట ఇచ్చినట్లు ప్రస్తుతం తన భార్య లేకపోయినప్పటికీ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు.ఇలా ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత మరణించిందని,తన మరణం తరువాత చాలామంది మరోసారి పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ తన పిల్లల భవిష్యత్తు ముఖ్యమని తాను పెళ్లి చేసుకోలేదని తెలిపారు.ప్రస్తుతం అమ్మాయిలు ఇద్దరు అమెరికాలో సెటిల్ అవగా కొడుకు రవిబాబు కూడా జీవితంలో మంచి స్థాయిలో ఉన్నాడని ప్రస్తుతం రవిబాబు దగ్గరే ఉంటున్నానని చలపతిరావు ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube