సోషల్ మీడియా సరికొత్త ఇన్నోవేషన్స్, టెక్నాలజీలు, ఇంకా అద్భుతమైన నిర్మాణాలను పరిచయం చేస్తుంటుంది.సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన నిర్మాణ సంబంధిత వీడియోలు వైరల్ అయ్యాయి.
తాజాగా ఆ తరహా వీడియో మరొకటి చక్కర్లు కొట్టడం స్టార్ట్ చేసింది.ఆ వీడియోలో ఒక సీక్రెట్ స్టెయిర్ కేసు( Secret Staircase ) కనిపించింది.
వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనం ఒక కిచెన్ రూమ్ చూడవచ్చు.
ఆ కిచెన్ రూమ్ లో( Kitchen Room ) ఒక టేబుల్ లాగా కిచెన్ కౌంటర్ ఉంది.దానికి ఉన్న ఒక స్విచ్ లేదా కీ లాంటిది మెలి తిప్పగానే ఆ టేబుల్ టాప్ వెంటనే వెనక్కి పోతూ కనిపించింది.కిందనేమో ఒక మెట్ల నిర్మాణం ప్రత్యక్షమైంది.
ఈ మెట్లపై( Steps ) నడుచుకుంటూ కిందకి వెళ్ళచ్చు.కింద లైట్ ఫెసిలిటీ కూడా ఉంది అందువల్ల చీకటిలో కింద పడిపోతామని భయపడక్కర్లేదు.
ఇలాంటి అండర్ గ్రౌండ్ సీక్రెట్ స్టెయిర్లు ఒక ఐలాండ్ లో( Island ) ఉన్నట్లు ఈ వీడియోను షేర్ చేసిన సైన్స్ గర్ల్ ట్విట్టర్ పేజీ వెల్లడించింది.
షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకు ఇప్పటికే 70 లక్షల వ్యూస్ వచ్చాయి.ఇలాంటి నిర్మాణం తమ ఇంట్లో కూడా సెటప్ చేసుకోవాలనుకుంటున్నామని మరికొందరు పేర్కొన్నారు.కిచెన్ కౌంటర్ కింద ఇంత పెద్ద మెట్లు ఉంటాయని అస్సలు ఊహించలేదంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు.
ఎవరినైనా వ్యక్తిని సీక్రెట్ గా దాచి పెట్టాలంటే ఇలాంటి నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని ఒక నెటిజెన్ అన్నారు.ఈ సీక్రెట్ మెట్లు మరొక రూమ్ కి దారి తీసే లాగా ఉన్నాయి.13 సెకన్ల నిడివిగల ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.