మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరనున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈ మేరకు శ్రీకాళహస్తి నుంచి సుమారు 150 కార్లతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.అయితే ఎస్సీవీ పార్టీలో చేరికపై ఆ పార్టీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన చంద్రబాబు సర్దిచెప్పడంతో సుధీర్ రెడ్డి స్వయంగా ఎస్సీవీ నాయుడును ఆహ్వానించడంతో చేరిక కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఎస్సీవీ నాయుడు చేరికకు బొజ్జల సుధీర్ రెడ్డి హాజరు అవుతారా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.