మెగా మూడోతరం వారసురాలు అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఉపాసన( Upasana ) రాంచరణ్ ( Ramcharan ) దంపతులు ఈనెల 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఇలా ఈమె పెళ్లయిన పది సంవత్సరాలకు తల్లి అవడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక మెగా ప్రిన్సెస్ ఎలా ఉంటుంది ఎవరి పోలికలతో ఉంటుందన్న విషయం గురించి అందరిలోనూ ఎంతో ఆత్రుత నెలకొంది.
ఈ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ ను చూడటం కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక నేడు రామ్ చరణ్ కుమార్తె బారసాల( Barasaala ) కావడంతో తన పేరుతో పాటు తన ఫేస్ కూడా రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారారనే విషయం తెలియడంతో ఎంతో మంది సెలబ్రిటీలు తమ చిన్నారిని చూడటం కోసం రావడమే కాకుండా సర్ప్రైసింగ్ గిఫ్ట్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇండియన్ కుబేరుడుగా ఎంతో పేరు పొందినటువంటి ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) ఇదివరకే రామ్ చరణ్ కుమార్తె కోసం బంగారు ఊయల( Golden Cradel ) కానుకగా పంపించారని సమాచారం అదేవిధంగా రామ్ చరణ్ ప్రాణ స్నేహితుడు శర్వానంద్ ( Sharwanand ) కూడా రామ్ చరణ్ కుమార్తె కోసం ఊహించని విధంగా గిఫ్ట్స్ పంపించారని తెలుస్తోంది.
పాప పుట్టినప్పటినుంచి తనకు ఏడాది వయసు వచ్చేవరకు తనకు కావాల్సినటువంటి బట్టల నుంచి మొదలుకొని బొమ్మలు బేబీ ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా రామ్ చరణ్ పాప కోసం గిఫ్ట్ చేశారని తెలుస్తోంది.వీటితో పాటు చిన్నారి కోసం ఒక లక్ష్మీదేవి లాకెట్ కూడా శర్వానంద్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారని తెలుస్తోంది.ఇలా రామ్ చరణ్ ప్రాణ స్నేహితుడైనటువంటి శర్వానంద్ కుమార్తె కోసం ఎన్నో కానుకలు పంపించగా మెగా హీరోలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదని వారితో పోలిస్తే శర్వానంద్ చాలా గ్రేట్ అంటూ అభిమానులు శర్వానంద్ పై కామెంట్లు చేస్తున్నారు
.