జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజ్ స్టార్ అని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు.వారాహి యాత్రలో పవన్ ను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.
టీడీపీతో జనసేన సహజీవనం చేస్తోందని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు.యువత భవిష్యత్ ను పవన్ కల్యాణ్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
పవన్ కు దమ్ముంటే పాదయాత్ర చేయాలన్నారు.జ్వరం పేరుతో డబ్బింగులు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
భీమవరంలో ఎన్ని వార్డులు, ఎన్ని మండలాలు ఉన్నాయో పవన్ కు తెలుసా అని ప్రశ్నించారు.నాదెండ్ల చంద్రబాబు కోవర్ట్ అని జనసేన నేతలే అంటున్నారని తెలిపారు.