ప్రతి సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి పదుల సంఖ్యలో దర్శకులు పరిచయం అవుతుంటారు.అయితే ఈ డైరెక్టర్లలో పది మందిలో ఇద్దరు మాత్రమే సక్సెస్ సాధిస్తున్నారు.సర్కారు నౌకరి సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శేఖర్( Shekhar ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.2006 సంవత్సరంలో జే.ఎన్.టీ.యూ ఫైన్ ఆర్ట్స్ కోర్స్ లో నేను జాయిన్ అయ్యానని ఆయన పేర్కొన్నారు.

ఆ సమయంలో ఏడాది కాలేజ్ ఫీజు 6500 రూపాయలు కాగా ఆ ఫీజు కట్టడానికి సైతం ఇబ్బందులు పడ్డానని శేఖర్ వెల్లడించారు.మరో దారి లేక తల్లి బంగారం తాకట్టు పెట్టి ఫీజు చెల్లించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.ఆ తర్వాత సంవత్సరం చిన్నా చితకా పనులు చేస్తూ ఫీజు చెల్లించాల్సి వచ్చిందని శేఖర్ పేర్కొన్నారు.
వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టారని శేఖర్ అన్నారు.

ఆ స్కీమ్ వల్ల నా ఆర్థిక కష్టాలు తీరాయని శేఖర్ కామెంట్లు చేశారు.6500 రూపాయలు ఇప్పుడు చాలా చిన్న మొత్తం అయినా అప్పట్లో నా ఆర్థిక పరిస్థితి వల్ల అదే ఎక్కువ మొత్తం అనిపించిందని ఆయన వెల్లడించడం గమనార్హం.ఆ సమయంలో వైఎస్సార్ నాకు( Rajasekhara Reddy ) దేవుడిలా అనిపించారని శేఖర్ అభిప్రాయపడ్డారు.
శేఖర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.సర్కారు నౌకరి( Sarkaru naukari ) మూవీకి రివ్యూలు బాగానే వచ్చినా ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
సర్కారు నౌకరి మూవీకి ప్రమోషన్స్ లో వేగం పెంచితే ఈ సినిమా కలెక్షన్లు పుంజుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఎన్నో కష్టాలు పడి చదివిన శేఖర్ ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ స్థాయికి చేరుకోవడం అంటే శేఖర్ ఎంతో గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వైరల్ అవుతుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.