మాటలు మాట్లాడలేకపోవడం, వినే సామర్థ్యం లేకపోవడం వల్ల దేశంలో ఇబ్బందులు పడుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు.అయితే ఈ రెండు లోపాలు ఉన్నా తన ప్రతిభతో సుప్రీంకోర్టులో( Supreme Court ) సైగలతో వాదనలు వినిపించి సారా సన్నీ ఔరా( Sara Sunny Aura ) అనిపించుకున్నారు.
శరీరానికి వైకల్యం ఉన్నా సంకల్పానికి అది అడ్డు కాదని ఆమె ప్రూవ్ చేశారు.కేరళ రాష్ట్రంలోని( Kerala ) కొట్టాయంకు చెందిన సారా సన్నీ జన్యు లోపం వల్ల మాట్లాడలేకపోయారు.
ఈమె సోదరి, సోదరుడు సైతం జన్యు లోపాల వల్ల ఇదే సమస్యను ఎదుర్కొన్నారు.అయితే సారా సన్నీ తల్లీదండ్రులు మాత్రం తమ పిల్లలను ప్రయోజకులను చేయాలని భావించారు.
సారా చిన్నప్పటి నుంచి అల్లరి అమ్మాయి అని మాట్లాడలేకపోయినా బాగా పోట్లాడేదని తల్లీదండ్రులు చెప్పుకొచ్చారు.సైగలతోనే ప్రశ్నించే గుణాన్ని అలవరచుకున్న సారా సన్నీ ఎల్.ఎల్.బీ( LL.B ) చేసి న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు.
సెయింట్ జోసెఫ్ లా కాలేజ్( St.Joseph’s Law College ) లో సారా సన్నీ చదివారు.తాను లాయర్ కావాలని ఎందుకు అనుకున్నాననే ప్రశ్నకు సారా సైగలతో సమాధానం చెబుతూ నాలా వైకల్యం ఉన్నవారికి ఉదాహరణగా నిలవాలనే ఆలోచనతో ఈ రంగాన్ని ఎంచుకున్నానని అన్నారు.
బిజినెస్ లాలో కెరీర్ ను కొనసాగించడమే నా లక్ష్యమని ఆమె కామెంట్లు చేసున్నారు.కర్ణాటక బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేయించుకున్నానని ఆమె పేర్కొన్నారు.
న్యాయవాద వృత్తిని చేపట్టిన తొలి బధిరురాలు నేనేనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.సారా సన్నీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.కలలు కనడంతోనే లక్ష్యాన్ని సాధించలేమని కోరుకున్న దాని కోసం కష్టపడాలని అనుమానాలు, కష్టాలు, కన్నీళ్లను స్థైర్యంతో దాటగలగాలని ఆమె చెప్పుకొచ్చారు.సారా సన్నీ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.