సంపత్ రాజ్.( Sampath Raj ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన బాడీ లాంగ్వేజ్ తో విభిన్నమైన స్వరం తో మంచి స్థాయిని సంపాదించుకున్న నటుడు.
ఆయన లేని సినిమా ఉండటం లేదు అన్నగా, తండ్రిగా, విలన్ గా ఆయన అనేక పాత్రలను తెలుగుతోపాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ చేస్తున్నాడు.నటుడుగా సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన పనిలేదు.
కానీ ఆయన వ్యక్తిగత విషయం జీవితం మాత్రం అనేగా ఒడిదుడుకుల తో గడిచిందనే చెప్పాలి ఒకానొక దశలో ఆయన తన జీవితాన్ని సరైన దిశలో నడిపించుకోలేక ఆత్మహత్య ప్రయత్నం కూడా వెళ్ళింది అంటే ఆయన జీవిత సమస్యలను ఏమేరకు చవిచూసారో అర్థం చేసుకోవచ్చు.
సంపత్ రాజ్ తీసుకొని ఒక కూతురు పుట్టిన తర్వాత నెలల వయసున్న కుమార్తెను వదిలేసి అతను భార్య ఆయన నుంచి విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది.దాంతో సంపత్ రాజ్ ఒంటరిగానే తన కుమార్తెను పెంచాడు.ఆమె పెరిగి పెద్దయ్యాక ఇటీవలే కొన్నేళ్ల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం సంపత్ రాజ్ కుటుంబ పరం గా బాగానే ఉన్నాడు కానీ మొదటి భార్యతో విడాకులు విషయంలో ఆయన అనుభవించిన శోభ గురించి సంపత్ రాజ్ స్వయంగా ఇంటర్వ్యూస్ లో తెలియజేశాడు.అయితే చాలా మంది సంపత్ రాజ్ మొదటి భార్య గురించి తెలిసి తెలియక ఒక నటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆమె మరెవరో కాదు నటి శరణ్య.( Actress Saranya ) తల్లి పాత్రలకు పెట్టింది పేరు అయినా శరణ్య సంపత్ రాజ్ మొదటి భార్య అని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది కానీ వాస్తవానికి శరణ్యకు జరిగింది కేవలం ఒక్క వివాహం మాత్రమే.ఆమె పొన్వన్నన్( Ponvannan ) అనే తమిళ నటుడిని పెళ్లి చేసుకుంది.ఆమెకు ఇద్దరు కుమార్తెలు కాగా ఆమెకు సంపత్ రాజ్ కి ఎలాంటి సంబంధం లేదు.
అయినా వీరిద్దరి విడాకుల వ్యవహారం అంటూ పలు ఆర్టికల్స్, వీడియోస్ చేయడం ఆపేసి వారి ప్రైవసీకి భంగం కలగకుండా చూస్తే మంచిది.