ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ ( YCP ) వచ్చే ఎన్నికలలో మరోసారి గెలవడానికి తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉంది.ఈ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్.
( CM Jagan ) నేతల పనితీరు పట్ల ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుని వాటి ఫలితాలు అనుగుణంగానే ఎన్నికలలో టికెట్ కేటాయింపు ఉంటుందని ఇప్పటికే తెలియజేయడం జరిగింది.దీంతో వైసీపీ పార్టీకి చెందిన కీలక నాయకులు ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలలో ఉంటూ వస్తున్నారు.
పార్టీ అధిష్టానం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రజలలో బిజీబిజీగా గడుపుతున్నారు.
మరోపక్క జరుగుతున్న సర్వేలలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.మేటర్ లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు.( Alluri Krishnamraju ) హైదరాబాద్ తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు.2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజోలు నియోజకవర్గంకి( Rajolu ) ప్రాతినిధ్యం వహించారు.ఆ తర్వాత వైసీపీ పార్టీలో కొనసాగడం జరిగింది.ఆయన భార్య మల్లీశ్వరి టీటీడీ పాలక సభ్యురాలిగా ఉన్నారు.దీంతో కృష్ణంరాజు మృతి పట్ల వైసీపీ నేతలు పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.