టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఖుషి సినిమా ( Kushi movie )షూటింగ్ పూర్తి చేసి అజ్ఞాతం లోకి వెళ్లి పోయినట్లుగా బ్రేక్ తీసుకుంది.ఈ ఏడాది బ్రేక్ లో ఆమె పలు దేశాల్లో చక్కర్లు కొడుతోంది.
అంతే కాకుండా అహ్లాదకరమైన జీవితం ను ఆమె గడుపుతోంది.స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇతర ప్రశాంత వాతావరణం లో ఆమె ఈ బ్రేక్ టైమ్ ను గడుపుతోంది.
అందుకే ఈ బ్రేక్ లో ఆమె కనీసం కథ లు వినేందుకు కూడా దర్శకులను కలవడం లేదు.ఆ మధ్య ఆమెకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న దర్శకుడు ఒకరు ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడట.
కానీ ఆయన్ను వచ్చే ఏడాది లో కలుద్దామని చెప్పిందట.దాంతో ఆయన ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ పనిలో పడ్డాడు అంటున్నారు.నిర్మాతలు మరియు దర్శకులు ఆమెను ఫోన్ ద్వారా కూడా కలిసేందుకు వీలు లేకుండా ఉంది.ఆమె వృత్తిగత ఫోన్ ను మేనేజర్ చూసుకుంటున్నాడు.ఆమె తో మాట్లాడాలి అంటే మరి కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు.ఇక కొత్త సినిమాల కి ఆమె కచ్చితంగా సైన్ చేస్తుంది.
కానీ ఆమె నుంచి కొత్త సినిమా రావడానికి వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన సిటాడెల్ ను వచ్చే ఏడాది ఆరంభం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
సమంత( Samantha ) వచ్చే ఏడాదిని సిటాడెల్ తో మొదలు పెడితే వెనక్కి తిరిగి చూసుకోకుండా బిజీ బిజీగా సినిమా లు మరియు సిరీస్ లు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సమంత మరియు నాగ చైతన్య( Akkineni Naga Chaitanya ) లు విడి పోయిన తర్వాత ఈ మధ్య కాలం లో చైతూ బిజీగా సినిమా లు చేస్తున్నా కూడా సమంత మాత్రం అనారోగ్య కారణాల వల్ల బ్రేక్ ల మీద బ్రేక్ లు తీసుకుంటూనే ఉంది.