తెలుగు బిగ్ బాస్ ( Bigg Boss ) ఇప్పటికే ఆరు సీజన్లను అట్టహాసంగా పూర్తి చేసుకొని ఒక ఓటిటీ సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది.
అయితే గత ఆరో సీజన్ అంత రేటింగ్ రాకపోవడంతో ఏడో సీజన్ మొత్తం ఉల్టా పల్టా ఉంటుందని సరికొత్త గేమ్ మీరు చూడబోతున్నారు అని ఇప్పటికే ఎన్నో అంచనాలు పెంచారు.కానీ గేమ్ చూస్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ అనిపించడం లేదు.
కానీ ఎంతో కొంత మాత్రం రేటింగ్ అయితే వస్తుంది.ఇక బిగ్ బాస్ ఐదు రోజులపాటు కంటెస్టెంట్లు గేమ్స్ ఆడుతూ ఉంటారు.
ఇక శని,ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున ( Nagarjuna ) వచ్చి వారి తప్పులను అలాగే వారి గేమ్ ప్లాన్ ని, వారి గొడవలు అన్నింటిని తెరమీదకి తీసుకువచ్చి వారు చేసింది తప్పైతే తప్పని, ఒప్పయితే ఒప్పని చెబుతారు.ఇక వీకెండ్ లో వచ్చే నాగార్జున రకరకాల డ్రెస్సులు వేసుకొని మనకు కనిపిస్తూ ఉంటారు.
అయితే గతవారం అంటే ఎనిమిదో వారం వీకెండ్లో నాగార్జున ఓ ఎల్లో కలర్ షర్టు ( Yellow color shirt )వేసుకొని వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఆ ఎల్లో కలర్ షర్టు మీద స్టార్స్ కూడా ఉన్నాయి.అయితే నాగార్జున వేసుకున్న ఆ ఎల్లో షర్టు ఖరీదు ఎంతో తెలిస్తే మీరందరూ నోరెళ్లబెడతారట.ఎందుకంటే ఆ షర్ట్ అంత కాస్ట్లీ గా ఉంది.
మరి ఆ షర్టు వ్యాల్యూ ఎంతో ఇప్పుడు తెలుసుకుందామా.సెలబ్రిటీలు అంటే కచ్చితంగా వారు లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేయడం ఖాయం.
కాళ్ళకు వేసుకునే చెప్పుల నుండి షర్ట్,ప్యాంటు, చేతికి పెట్టుకునే వాచ్,గాగుల్స్,బ్యాగ్స్ ఇలా ప్రతి ఒక్క దానికి లక్షల్లోనే ఖర్చు చేస్తారు.అయితే పోయిన వీకెండ్లో నాగార్జున వేసుకున్న పసుపు రంగు షర్ట్ ఖరీదు 25,353 రూపాయలట.
ఇక ఒక షర్ట్ కే అన్ని వేలా అని మీరు అనుకోవచ్చు.కానీ సెలబ్రిటీలకు ఇది చాలా చీప్.
అలాగే నాగార్జున వేసుకున్న షర్టు ప్యూర్ కాటన్ తో పాటు ఎప్పటికీ చెక్కుచెదరని డిజైన్ అలాగే కలర్ కూడా పోదట.అంతేకాకుండా ఆ షర్ట్ పై కొన్ని స్పెషల్ లిక్విడ్స్ వాడి దానిపై ఉండే స్టార్స్ డిజైన్ చేశారట.
ఈ కారణం తోనే ఆ షర్ట్ కి 25వేల కాస్ట్ ఉందని తెలుస్తోంది.ఇక ఒక్క షర్ట్ విలువనే 25000 అని తెలిసి కొంత మంది నెటిజెన్లు ఒక్క షర్ట్ కే అన్ని డబ్బులు తగలేస్తారా అని కామెంట్లు పెడుతున్నారు.