అక్కినేని నాగార్జున అమల ( Akkeneni Nagarjuna, Amala ) లు రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.మొదట దగ్గుబాటి లక్ష్మీ (Daggubati Lakshmi) ని పెళ్లి చేసుకున్న నాగార్జున నాగచైతన్య పుట్టాక విడాకులు ఇచ్చి అమల ని ఓ సినిమా షూటింగ్లో భాగంగా కలిసి ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడడంతో ఇద్దరు సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడే ప్రేమలో పడి ఇంట్లో అక్కినేని నాగేశ్వరావుని సైతం బెదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు నాగార్జున.
అయితే అమల తల్లి అమలను నాగార్జున (Nagarjuna) రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం తెలిసి ఇంటికి నాగార్జున అమల ఇద్దరిని పిలిపించుకొని ఒక కండిషన్ పెట్టారట.మరి అమల తల్లి నాగార్జునకి పెట్టిన కండిషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందింది తండ్రి బెంగాలీ.ఇక అమల సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో నాగార్జునతో ప్రేమలో పడ్డ సంగతి అందరికీ తెలిసిందే.
అయితే నాగార్జునని పెళ్లి చేసుకుంటాను అనే విషయం అమల తన తల్లికి చెప్పిందట.దాంతో నాగార్జునని ఇంటికి పిలిపించుకొని అమల తల్లి (Amala mother) మాట్లాడుతూ.నువ్వు నీ మొదటి భార్యకు ఏ కారణంతో విడాకులు ఇచ్చావో నాకు తెలియదు కానీ నా కూతురి విషయంలో మాత్రం అలా జరగకూడదు.అలాగే నీ మొదటి భార్య వల్ల నా కూతురికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు.
ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి.
కానీ ఆ చిన్న చిన్న వాటికే విడాకుల వరకు వెళ్లి నా కూతురి పరిస్థితి ఎటూ కాకుండా చేసి విడాకులు ఇస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను.ఇక ఈ కండిషన్ లన్నింటికీ ఒప్పుకుంటేనే నేను నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాను.లేకపోతే ఇప్పుడే నా కూతురితో నీ ప్రేమ బ్రేకప్ చేసుకో అని నాగార్జునకి కండిషన్ పెట్టిందట.
అయితే అప్పటికే అమలను ప్రాణంగా ప్రేమిస్తున్న నాగార్జున అమల తల్లి పెట్టిన కండిషన్ లన్నిటికి ఓకే చెప్పారట.అలా వీరిద్దరి పెళ్లి జూన్ 11, 1992లో జరిగింది.