ఫ్రీగా హగ్స్ ఇస్తున్న సమంత... మేము చెట్లమే అంటూ నెటిజెన్స్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.‘ఏం మాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఎంతోమంది ప్రేక్షకులను తన అందంతో మాయ చేసి అభిమానులుగా మార్చుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఈ ముద్దుగుమ్మ తెగ అవకాశాలు అంటుకుంటుంది.

 Samantha Giving Free Hugs Netizens Are Comments Samantha, Free Hugs, Tollywood,-TeluguStop.com

ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.ఇక ఈమె నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోగా గత ఏడాది ఆయనను విడాకుల పేరుతో దూరం పెట్టిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతూ మరింత యాక్టివ్ గా మారింది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్న పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇంతకు అందులో ఏముందంటే.తను ఒక చెట్టు ను కౌగిలించుకున్నట్లుగా కనిపించింది.

పైగా వైట్ కలర్ డ్రెస్ వేసుకొని నాచురల్ గా బాగా ఆకట్టుకుంది.ఇక ఈ పోస్ట్ కు ‘ఫ్రీ హగ్స్‘ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకోవడంతో లైక్ లతో పాటు కామెంట్లు కూడా వచ్చి పడుతున్నాయి.

Telugu Hugs, Guna Shekar, Samantha, Shakunthalam, Tollywood, Yashoda-Movie

నెటిజన్లు మాత్రం తమకు నచ్చినట్లుగా కామెంట్లు పెడుతున్నారు.అందులో ఓ నెటిజన్ మేము కూడా చెట్లమే అంటూ సమంత హగ్ కోసం సరదాగా కామెంట్ పెట్టారు.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శాకుంతలం, యశోద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube