శాంతిస్థాపన అనే ప్రముఖ స్వచ్ఛంద సేవాసంస్థ అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తుంది.ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ ఒక మంచి సేవా సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
అయితే ఈ సంస్థ అందించే సాయానికి ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది మంది ఎంపిక కాగా వారిలో భారత్ లో అసోం కి చెందిన సల్మా అనే యువతి ఎంపిక కావడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నారు
అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్క భారత మహిళా కూడా ఈ సాయం పొందటానికి అర్హత సాధించలేదు… అసోంలోని కామ్రూప్ (గ్రామీణ) జిల్లా సంటోలి గ్రామానికి చెందిన సల్మా ఇటీవల న్యాయశాస్త్రంలో డిగ్రీ చదివారు.చిన్న తనం నుంచీ సేవా భావాలు ఎక్కువగా ఉండే సల్మా అసోంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, దాన్ని శాంతివనం గా మార్చాలని ఆకాంక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె ఆకాంక్షను నెరవేర్చడానికి అండీ లీడర్షిప్ ఇనిస్టిట్యూట్ ఫర్ యంగ్ విమెన్ అనే సంస్థ ముందుకొచ్చింది.ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన ఆండీ పరమొవచ్ అనే సామాజిక కార్యకర్త 2007లో ఇరాక్‌లో చనిపోయారు.ఆయన స్మృత్యర్థం ఏర్పడిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఆర్థికసాయం చేస్తోంది.
అయితే సల్మా కి ఆగస్టు 5 నుంచి 18 వరకు వాషింగ్టన్ డీసీలో సల్మాకు శిక్షణ కార్యక్రమం ఉంటుందిఆ.
ఆ సమయంలోనే ఎంతో మంది మానవ హక్కుల నేతలతో ఆమెకి ముఖా ముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమెకి మరింతగా సూచనలు అందిస్తారని సంస్థ తెలిపింది.