వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.అర్జెంటుగా అధికారం చేపట్టాలన్న ఆశ చంద్రబాబుదని విమర్శించారు.
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని సజ్జల ఆరోపించారు.ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థికి పోలైన ఓట్లను లెక్కించాలని డిమాండ్ చేశామన్నారు.
వైసీపీ ఎప్పుడూ ధర్మయుద్ధమే చేస్తుందని తెలిపారు.చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.