సినిమాలకు కమిట్ అవ్వాలంటే కొత్త కండిషన్ పెడుతున్న సాయి పల్లవి!

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సాయి పల్లవి ( Sai Pallavi ) లవ్ స్టోరీ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే తాజాగా ఈమె వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య( Nagachaitanya ) హీరోగా నటిస్తున్నటువంటి తండేల్ ( Tandel) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Sai Pallavi Put New Condition To Producer For Agree New Movies, Sai Pallavi, New-TeluguStop.com

ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిన్న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమయ్యాయి.ఇక సాయి పల్లవి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.

Telugu Nagachaitanya, Sai Pallavi, Thandel, Tollywood, Shop-Movie

ఇక సాయి పల్లవి ఒక సినిమాకు కమిట్ అవ్వాలి అంటే ఎన్నో కండిషన్లు( Condition ) పెడతారు అయితే తాజాగా ఈమె ఆ కండిషన్ల జాబితాలోకి మరొక సరికొత్త కండిషన్ చేర్చారని తెలుస్తుంది ముందుగా సాయి పల్లవి ఏదైనా ఒక సినిమా చేయాలి అంటే తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి అనే కండిషన్ పెడతారట.అలాంటి పాత్రలలో అయితేనే తాను నటిస్తానని ఈమె నిర్మొహమాటంగా చెబుతారు.తన పాత్ర మాత్రమే కాకుండా సినిమాలో కంటెంట్ కూడా బాగుంటేనే తాను నటిస్తుందని లేకపోతే ఆ సినిమాకు దూరంగా ఉంటారని మనకు తెలిసిందే.

Telugu Nagachaitanya, Sai Pallavi, Thandel, Tollywood, Shop-Movie

ఇకపోతే తాజాగా ఈమె నిర్మాతలకు మరొక కొత్త కండిషన్ పెడుతున్నారు.తాను ఒక సినిమాకు కమిట్ అవ్వాలి అంటే ముందుగానే వర్క్ షాప్(Work Shop) కూడా చేయాల్సిందేనని ఈమె కండిషన్ పెడుతున్నారట.వర్క్ షాప్ చేయడం వల్ల ఎలాంటి సీన్స్ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి గెటప్ లుక్స్ అన్ని ఫర్ఫెక్ట్ గా ఉంటాయి అందుకే ఈమె కూడా తన సినిమాలకు వర్క్ షాప్ చేయాలని అందులో తాను కూడా పాల్గొంటాను అంటూ కండిషన్ పెడుతున్నారట అయితే ఇదంతా కూడా కేవలం సినిమా మంచిగా రావడం కోసమే ఈమె దర్శక నిర్మాతలకు కండిషన్ పెడుతున్నారు తప్ప స్వలాభం కోసం కాదు అని తెలుస్తుంది.సాధారణంగా ఎవరైనా వారి సేఫ్ జోన్ కోసం కండిషన్లు పెడుతూ ఉంటారు కానీ ఈమె మాత్రం సినిమా కోసం కండిషన్లు పెట్టడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube