సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి చాలా తక్కువ సమయం ఉంటుంది అని అందరూ అంటుంటారు కానీ ఆ పరిస్థితి గతంలో .ఇప్పుడు కాదు.
పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి.ఒకటి రెండు సినిమాల్లో కనిపించనంత మాత్రాన మా పని అయిపోయిందంటే ఒప్పుకోము… మేము బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉంటాము అని నిరూపిస్తున్నారు నేటితరం హీరోయిన్స్.
సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు ఓటిటి, వెబ్ సిరీస్ అంటూ రకరకాల ప్లాట్ఫామ్స్ రెడీ అయిపోయాయి కాబట్టి ఏదో ఒక దాంట్లో బిజీగా ఉంటూ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడం పెద్ద పనేమీ కాదు అని కూడా నిరూపిస్తున్నారు.మరి ఇప్పుడు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఇదే సినిమాలో చేస్తూ రచ్చ రచ్చ చేయబోతున్నారు.ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు ? వారు చేస్తున్న సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాయి పల్లవి
తెలుగు లో విరాటపర్వం సినిమా తర్వాత మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించలేకపోయింది సాయి పల్లవి( Sai pallavi ).ఆమె తమిళ్ లో తీసిన గార్గి తెలుగులో కూడా విడుదలైనప్పటికీ అది కూడా నిరాశనే మిగిల్చింది.దాంతో సాయి పల్లవి సినిమాలను మానేసి మళ్ళీ డాక్టర్ వృత్తిని చేపట్టింది అంటూ సోషల్ మీడియా గత కొన్ని నెలలుగా హల్చల్ చేస్తూనే ఉంది.
వాటికి సమాధానం ఇస్తూ ప్రస్తుతం తాను చేయబోతున్న సినిమాల లైనప్ ఏంటో చూపిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది సాయి పల్లవి.ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.
వీరు గతంలో లవ్ స్టోరీ సినిమా( Love Story ) ద్వారా విజయాన్ని అందుకున్నారు.ఇక తమిళ్లో శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నారు రామాయణం సినిమాలో కూడా సీత పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.
పూజ హెగ్డే
గుంటూరు కారం వంటి సినిమా నుంచి బ్యాక్ అయినా పూజకి తెలుగులో అవకాశాలు దక్కడం ప్రస్తుతం కష్టంగా మారింది అనేది అందరికీ తెలిసిన విషయమే.రెండు మూడు తెలుగు సినిమాల నుంచి కొన్ని కారణాల వల్ల ఆమె మళ్లీ ఏ తెలుగు సినిమా కూడా ఆమె సంతకం చేయలేదు.కానీ ఈ సమయంలో బాలీవుడ్ పై ఫోకస్ పెంచిన పూజ అక్కడ వరస ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతుంది.కపూర్ తో ఒక సినిమాలో నటిస్తున్నటువంటి పూజా హెగ్డే ప్రస్తుతం మరొక మల్టి స్టారర్ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించబోతోంది.
ఈ రెండు సినిమాలు కనుక విజయం సాధిస్తే పూజా హెగ్డే కి బాలీవుడ్ ( Pooja Hegde )లో తిరుగులేని స్టార్ డం దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.