ముల్లేర్పై విచారణకు సంబంధించి అమెరికా న్యాయశాఖ తన సమీక్షలో దానిని నేర పరిశోధనగా అప్‌గ్రేడ్ చేయబడిందని మీడియా ప్రచురించింది.2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారంలో మాస్కో ఎటువంటి నేరపూరిత కుట్రకు పాల్పడలేదని ముల్లేర్ నివేదిక చెబుతోంది.అయితే ఈ వ్యవహారంపై రష్యా దర్యాప్తును ప్రారంభించిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పదే పదే మాటల దాడిని చేస్తున్నారు.
ఇది న్యాయ సమీక్ష నుంచి క్రిమినల్ విచారణకు మార్చడం అంటే ఇక నుంచి దర్యాప్తు అధికారులు సాక్షులు, సాక్ష్యాలు, ఇతర కీలక పత్రాల కోసం నోటీసులు జారీ చేయవచ్చునని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను రష్యాతో కలిసి కుట్ర చేయలేదనే అంశంపై రాబర్ట్ ముల్లర్ పార్లమెంట్‌కు నివేదిక ఇవ్వడం అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.అప్పటి నుంచి ముల్లర్ నివేదికపై యూఎస్ అటార్నీ జనరల్ విలియమ్ బార్ దర్యాప్తు చేస్తున్నారు.

448 పేజిల ముల్లర్ నివేదికలో ట్రంప్ ప్రచారం-మాస్కోల మధ్య ఉన్న సంబంధాన్ని తేటతెల్లం చేయలేకపోయింది.అప్పట్లో ముల్లర్ నివేదికపై స్పందించిన ట్రంప్.‘‘కుమ్మక్కూ లేదు.ఆటంకమూ లేద’’ని వ్యాఖ్యానించారు.అంతేకాకుండా ఈ విచారణను ‘‘విఫలమైన అక్రమ దాడి’’ అంటు అభివర్ణించారు.రాబర్ట్ ముల్లర్ రెండేళ్లపాటు దర్యాప్తు చేసి ఈ నివేదికను రూపొందించారు.
ఇందులో భాగంగా ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన అంతరంగీకుల మీద న్యాయస్థానంలో విచారణ జరగడంతో పాటు కొందరు జైలుకు సైతం వెళ్లారు.ట్రంప్ ఎటువంటి నేరము చేయకపోయినప్పటికీ.
ఆరోపణల నుంచి ఆయనను నిర్దోషిగా అంగీకరించే ప్రసక్తిలేదని ముల్లర్ తెలిపారు.