రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ప్రపంచ దేశాలు భావించాయి.కానీ రోజురోజుకీ వీటి మధ్య పోరు అత్యంత తీవ్రంగా మారుతుందే తప్ప ముగిసే సూచనలు కనుచూపుమేర కనిపించడం లేదు.
రష్యా దేశం( Russia ) సరికొత్త వ్యూహాలను అవలంబిస్తూ ఉక్రెయిన్ సైనికులపై తన దాడిని ఎప్పటికప్పుడు పెంచుతోంది.ఇప్పుడు పుతిన్ ( Putin ) దేశ సైన్యం మరో షాకింగ్ వ్యూహాలకు తెర లేపింది.
ఈ సైన్యం పాత ట్యాంకులను పేలుడు ఆయుధాలుగా మార్చడం వంటి అసాధారణ వ్యూహాలను తాజాగా ప్రయోగించింది.ఈ ట్యాంకులు పేలుడు పదార్థాలతో( Tank Explosives ) నిండి ఉంటాయి.
సైనికులు వీటిని రిమోట్‌గా పేల్చడానికి ముందు ఉక్రేనియన్( Ukraine ) స్థానాల వైపు వాటిని డ్రైవ్ చేస్తారు.
ఈ సూసైడ్ ట్యాంక్ బాంబులు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయో చూపించే ఒక వీడియో కూడా స్పెషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోలో ట్యాంక్ శత్రు రేఖ వైపు కదులుతున్నట్లు కనిపించింది.తరువాత ఉక్రెయిన్ డిఫెన్స్ వ్యవస్థతో అది తలపడి పెద్ద మంటలతో పేలిపోయింది.
ఈ పేలుడు యాంటీ ట్యాంక్ క్షిపణి వల్ల సంభవించిందా, లేదంటే భూమిలో దాచిన ల్యాండ్‌మైన్ వల్ల జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది.కాగా ఈ వ్యూహం వల్ల శత్రు దేశానికి ఎంత నష్టం వాటిల్లిందనేది ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల తాము పేలుడు పదార్థాలను మోసుకెళ్లే మానవరహిత ట్యాంక్‌ను ఉక్రేనియన్ కోటపై దాడి చేయడానికి ఉపయోగించినట్లు తెలిపింది.పేలుడు పదార్థాలను రిమోట్‌తో పేల్చడంతో శక్తిమంతమైన పేలుడు సంభవించిందని వెల్లడించింది.శత్రువులకు ఇది తీవ్ర నష్టం కలిగించిందని ఆరోపణలు చేసింది.3.5 టన్నుల TNT, ఐదు FAB-100 బాంబులతో ఆ ట్యాంక్ నింపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.అయితే రష్యా ప్రయోగిస్తున్న ఈ వ్యూహాల గురించి తెలిసి ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి.