తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా పాపులర్ అయిన నటీమణుల్లో సోనియా అగర్వాల్ ఒకరు.సోనియా అగర్వాల్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
అయితే హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించడంలో సోనియా అగర్వాల్ ఫెయిలయ్యారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సోనియా అగర్వాల్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
అయితే గత కొన్నిరోజులుగా సోనియా అగర్వాల్ వార్తల్లో నిలుస్తున్నారు.
ప్రస్తుతం ఒంటరిగా జీవనం సాగిస్తున్న సోనియా అగర్వాల్ ఎస్పీ బాలు కొడుకు చరణ్ ను పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.2006 సంవత్సరంలో సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ ల వివాహం జరిగింది.అయితే పెళ్లైన నాలుగేళ్లకే మనస్పర్ధలు రావడంతో ఈ జంట విడిపోయారు.
అయితే ఎస్పీ చరణ్ సోనియా అగర్వాల్ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని సమాచారం అందుతోంది.
తాజాగా ఎస్పీ చరణ్ సోనియా అగర్వాల్ భుజంపై చెయ్యి వేసి ఫోటో దిగగా ఈ ఫోటో వైరల్ కావడంతో ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది.

అయితే ఈ ఫోటో వెబ్ సిరీస్ షూటింగ్ లో భాగంగా దిగిన ఫోటో కావడం గమనార్హం.ఈ వెబ్ సిరీస్ లో సంతోష్ ప్రతాప్, అంజలి కూడా నటిస్తున్నారు.ఒరిజినల్ ఫోటోను కట్ చేసి చరణ్, సోనియా అగర్వాల్ మాత్రమే ఉన్నట్టు ఫోటోను షేర్ చేయడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

పెళ్లి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ రావడంతో సోనియా అగర్వాల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.మరోవైపు ఎస్పీ చరణ్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.ఒకవైపు సింగర్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే పలు రియాలిటీ షోలకు ఎస్పీ చరణ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
నటుడిగా, నిర్మాతగా కూడా చరణ్ సత్తా చాటుతున్నారు.