రణరంగం అయిన ట్యాంక్‌బండ్‌

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నేడు ఛలో ట్యాంక్‌ బండ్‌కు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.

ముందు నుండి కూడా ఛలో ట్యాంక్‌ బండ్‌కు అనుమతించని ప్రభుత్వం మరియు పోలీసులు జిల్లాల్లోనే ఆర్టీసీ కార్మికులను అరెస్ట్‌లు చేస్తూ హైదరాబాద్‌కు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు.

పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా చాలా మంది ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్‌ చేరుకున్నారు.అయితే పోలీసులు ట్యాంక్‌ బండ్‌పై పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు.

ట్యాంక్‌ బండ్‌కు ఉన్న ఎనిమిది మార్గాల్లో అన్నింట కూడా పోలీసుల బందోభస్తు భారీగానే ఉంది.అయినా కూడా కార్మికులు పోలీసుల కళ్లు గప్పి ట్యాంక్‌బండ్‌కి చేరుకున్నారు.

దాంతో పోలీసులు మరియు ఆర్టీసీ కార్మికుల మద్య తీవ్ర గలాట జరిగింది.ఆర్టీసీ కార్మికులు మరియు ఆందోళనకారులు కొందరు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుని పోలీసులపైకి రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించారు.

Advertisement

వారు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ చార్జ్‌ చేయాల్సి వచ్చిందట.లాఠీ చార్జ్‌లో పలువురు ఆర్టీసీ కార్మికులు మరియు ఆందోళన కారులు గాయాల పాలయ్యారు.

పోలీసులు తీవ్రంగా శ్రమించి వారందరిని కూడా అక్కడ నుండి తప్పించారు.ఆర్టీసీ కార్మికులు నిర్వహించ తలపెట్టిన ఛలో ట్యాంక్‌ బండ్‌ కొంచెం ఫ్లాప్‌ కొంచెం సక్సెస్‌ అన్నట్లుగా జరిగింది.

మొత్తానికి రోజంతా కూడా ట్యాంక్‌బండ్‌ రణరంగంగా మారింది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు