అయోధ్య కేసు : మాకేం విరాళం అక్కర్లేదు, ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

పదులు.వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న అయోధ్య వివాదాస్పద భూమి వివాదంకు నేడు సుప్రీం కోర్టులో శాస్వత పరిష్కారం లభించింది.ఈ భూ వివాదంలో హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.రామ మందిరం నిర్మాణంకు సుప్రీం కోర్టు ఆ భూమిని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.ఇదే సమయంలో ముస్లీంల కోసం అయోధ్యలోనే అయిదు ఎకరాల భూమిని కేటాయించాలంటూ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది.సుప్రీం తీర్పుపై ముస్లీంలు కాస్త అసంతృప్తిగా ఉన్నారు.

 Mp Assaduddin Owaisi Comments On Ayodhya Rama Mandir Judgement-TeluguStop.com

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఈ తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం, దేశం విజయంగా భావిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేయగా ఒవైసీ మాత్రం కాస్త ఘాటుగా స్పందించారు.

ఇన్నాళ్లు మేము పోరాడింది అయిదు ఎకరాల భూమి విరాళం కోసం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.మేము ఆ అయిదు ఎకరాల భూమిని తీసుకునేందుకు సిద్దంగా లేము అంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటీషన్‌ వేసే విషయమై కూడా ఆలోచనల్లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.ముస్లీ పర్సనల్‌ లా బోర్డు ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్బంగా ఆయన వ్యక్తం చేశాడు.

ఒక వర్గం వారికి అన్యాయం చేసినట్లే అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.అయోధ్య కేసు విషయమై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి హెచ్చరిస్తూనే ఉన్నా ఒవైసీ మాత్రం తనదైన శైలిలో స్వరం పెంచి సుప్రీం తీర్పును గౌరవిస్తున్నట్లుగా చెబుతూనే తప్పుబట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube