వైరల్ ఫోటో: ఒక్క ఫోటో.. మనస్సును కదిల్చేస్తుంది..!

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా వారి టాలెంట్ ను చూపిస్తూ పలు రకాల ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు.ఇకపోతే అందులో కొన్ని ఫోటోలు చూడటానికి ఇష్టపడకపోయినా, కొన్ని ఫోటోలను చూస్తే మాత్రం మనసు ఇట్లే ఆకట్టుకుంటుంది.

 Photo Story Of Elephants Eating From Garbage Dump, Garbage Dump, Elephants, Roya-TeluguStop.com

వాటిని చూడడం ద్వారా మన మనసు కూడా ఎంతో ఆనందంగా మారిపోతుంది.మరికొన్ని చూస్తే కచ్చితంగా కన్నీళ్లు తెచ్చే విధంగా ఉంటాయి.

ఇకపోతే తాజాగా ప్రతి ఒక్కరి మనసును కదిలించే విధంగా ఉన్న ఫోటో ఈ సంవత్సరం రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ ఫోటోగ్రఫీలో మొదటి స్థానంలో నిలిచింది.ఇక అంతలా ఆ ఫోటోలో ఏముంది అన్న విషయం గురించి చూస్తే…

మూగజీవాల కష్టాలను కళ్లకు కనిపించేలా ఉంది ఆ ఫోటో చూడడానికి.

అయితే ఈ ఫోటో శ్రీలంకలోని ఓ చెత్త డంప్ వద్ద తీసింది.ఆ సమయంలో చెత్త డంప్ వద్ద ఓ ఏనుగుల మంద చెత్త డంప్ లో ఉన్న ఆహార పదార్థాలను ఏరుకొని తినడానికి వచ్చిన దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ చిత్రీకరించాడు.

ఈ చిత్రాన్ని తీసిన వ్యక్తి పేరు తర్మపాలన్.ఇకపోతే శ్రీలంకలోని ఓ చెత్త డ్యామ్ వద్ద ఓ ఏనుగుల మంద ఆహారం కోసం ఆ డంప్ లో వెతుకుతున్న దృశ్యాన్ని ఆయన చిత్రీకరించడంతో ఆ ఫోటో కాస్త బయటికి రావడంతో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో కదిలించివేసింది.

ఇలా చెత్త డంప్ లో కలుషితమైన ఆహారాన్ని తిని ఏనుగులు ప్రతిసంవత్సరం వందలాది సంఖ్యలో చనిపోతున్నాయి.

ఇకపోతే తాజాగా ఈ ఫోటో కు సంబంధించి శ్రీలంక అధికారులు స్పందించారు.

ఇక నుంచి ఎవరు కూడా ఏనుగులు సంచరించే ప్రదేశాల్లో చెత్తను వేయకూడదని నిషేధించినట్లు తెలిపారు.అలాగే తాజాగా రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ అనే సంస్థ కొన్ని ఫోటోలను పరిశీలించగా అందులో ఈ ఫోటోకు మొదటి బహుమతికి ఎంపికయింది.

ఇందుకు సంబంధించి ఈ ఫోటో గ్రాఫర్ కి వెయ్యి డాలర్ల ప్రైజ్ మనీ లభించింది.ఇందుకు సంబంధించి అవార్డు గ్రహీత స్పందిస్తూ “నేను ఈ అవార్డు గ్రహీత అయినందుకు గర్వపడుతున్నట్లు, అలాగే ఈ ఫోటోగ్రాఫి అవార్డు నా ఆత్మవిశ్వాసాన్ని మెరుగు పరిచిందని తెలిపాడు.

అంతేకాదు ఈ ఫోటో నా భవిష్యత్తు ప్రాజెక్టులకు మరిన్ని బాధ్యతలను ఇస్తుందని తెలిపారు.ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఎంతోమంది జంతు ప్రేమికులు అతడు తీసిన ఫోటోను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube