బడ్జెట్ రూ.2 కోట్లు కలెక్షన్లు రూ.55 కోట్లు.. సంచలనం సృష్టించిన సినిమా ఇదే!

ఇతర ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే సినిమా ఇండస్ట్రీలో నష్టాల భయం ఎక్కువనే సంగతి తెలిసిందే.100 సినిమాలు థియేటర్లలో విడుదలైతే ఆ సినిమాలలో కేవలం 10 నుంచి 15 సినిమాలు మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుంటాయి.అయితే చాలా సినిమాలు బడ్జెట్ తో పోల్చి చూస్తే 10 శాతం కంటే ఎక్కువ మొత్తం లాభాలను అందించవు.అయితే ఒక సినిమా మాత్రం బడ్జెట్ తో పోలిస్తే ఏకంగా 25 రెట్ల లాభాలను అందించింది.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రొమంచమ్ మూవీ 55 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

 Romancham Movie Record Collections Details Here Goes Viral In Social Media , So-TeluguStop.com

ఒక మలయాళ సినిమా ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తక్కువ పెట్టుబడితో తెరకెక్కిన ఈ సినిమా ఈ స్థాయిలో లాభాలను అందించిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ సినిమా సక్సెస్ తో మలయాళ సినీ ఇండస్ట్రీ పేరు మరోసారి మారుమ్రోగుతోంది.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మలయాళ సినిమాలు ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి.

బడాస్టార్లు లేకపోయినా ఈ సినిమా సక్సెస్ సాధించడం గమనార్హం.30 రోజుల క్రితం రొమంచమ్ పేరుతో మలయాళంలో విడుదలైన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.జితు మాధవన్ ఈ సినిమా డైరెక్టర్ కాగా హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

షాబిన్ షాహిర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం.ఏడుగురు బ్రహ్మచారులకు సంబంధించిన కథతో ఈ మూవీ తెరకెక్కింది.

ఆ బ్రహ్మచారులు ఔజా గేమ్ ఆడి ప్రేతాత్మలతో మాట్లాడగా ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏంటనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా రీమేక్ హక్కులను ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొనగా తెలుగులో ఈ సినిమా రీమేక్ ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా రీమేక్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube