ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం సంచలనంగా మారి తీవ్ర ఆందోళనలకి దారి తీసిన సంగతి తెలిసిందే.ఇతర దేశాలలో ఉన్న ముస్లింయేతర మతాల వారికి ఇండియాలో పౌరసత్వం ఇచ్చే విధంగా ఉన్న ఈ చట్టాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు.
మరో వైపు కొన్ని రాష్ట్రాలలో గుట్టుచప్పుడు కాకుండా బంగ్లాలో మైనార్టీలుగా ఉన్న ఉన్న రోహింగ్యా ముస్లింలని ఆ దేశం నుంచి వెల్లగోడుతున్న సంగతి తెలిసిందే.అలా బంగ్లా నుంచి పొట్ట చేత పట్టుకొని వలన వచ్చి ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్ లో ఉంటున్న వారు ఇప్పుడు దేశంలో అలజడులకి కారణం అవుతున్నారు.
అయితే విపక్షాలు వారికి మద్దతుగా నిలబడుతూ ఆందోళనలు చేస్తుంది.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింలతో వస్తున్నా పడవను సెంటినలీస్ తెగవారు నివసించే దీవి సమీపంలో భారత దేశ అధికారులు నిలిపేశారు.
ఆ పడవలో 66 మంది అనుమానిత రొహింగ్యాలు ఉన్నట్లు అండమాన్ నికోబార్ పోలీసులు తెలిపారు.ఈ పడవను తర్ముగ్లి దీవి సమీపంలో నిలిపేసినట్లు సమాచారం.ఈ ప్రాంతం నార్త్ సెంటినెల్ దీవికి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తుంది.రొహింగ్యాలతో వస్తున్న ఈ పడవ దాదాపు 15 రోజుల క్రితం బంగ్లాదేశ్ నుంచి బయల్దేరినట్లు సమాచారం.
ఈ నెల 13న ఈ పడవ గురించి పోర్ట్ బ్లెయిర్ పోలీసులకు సమాచారం అందడంతో సముద్రంలో గాలింపు చేపట్టి పడవను గుర్తించి, దానిలో ప్రయాణిస్తున్న 66 మందిని అదుపులోకి తీసుకున్నారు.