గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.నాగార్జున యూనివర్సిటీ ఉమెన్స్ హస్టల్ సమీపంలో కంటైనర్ మరో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు.కంటైనర్ గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తుండగా మరో లారీ గుంటూరు వైపు వెళ్తుందని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.