పూజ చేశాకే కాంతార షూటింగ్ మొదలు పెట్టేవాన్ని.. రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్!

కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.ఈ సినిమా సెప్టెంబర్ 30న కనడంలో విడుదలైంది.

 Rishabh Shetty Interesting Comments On Kantara Divine Panjurli Devatha,rishabh S-TeluguStop.com

అనంతరం ఈ చిత్రాన్ని అక్టోబర్ 15వ తేదీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.తెలుగులో కూడా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ విధంగా ఈ చిత్రం అన్ని భాషలలో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఈ సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రిషబ్ శెట్టి ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.కాంతార సినిమాలో పంజుర్లీ దేవత గురించి ప్రత్యేకంగా చూపించారు.

మనశ్శాంతి కోసం ఆ దేవతను తనకి ఇవ్వమని ఒక రాజు అడగడంతో ఆ ప్రజలు ఆ దేవతను రాజుకు ఇవ్వడం వారి మధ్య భూ ఒప్పందం వంటి ఎన్నో అంశాలతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Telugu Kantara, Rishabh Shetty, Pooja-Movie

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హీరో రిషబ్ శెట్టి పంజుర్లీ దేవత గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.తాను వ్యక్తిగతంగా కూడా పంజుర్లీ దేవతను ఎంతగానో విశ్వసిస్తానని ఈయన తెలిపారు.ఇక ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ప్రతిరోజు కూడా ఉదయం పంజుర్లీ దేవతను పూజించిన తర్వాత ఆమెకు పూజ చేసిన అనంతరమే సినిమా షూటింగ్ ప్రారంభించే వాన్ని అంటూ ఈ సందర్భంగా రిషబ్ శెట్టి పేర్కొన్నారు.

ఇక చిన్నప్పటినుంచి తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆచారాన్ని కల్లారా చూస్తూ పెరిగాను.ఇలా తన గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగానే ఈ సినిమా సిద్ధం చేసుకున్నానని తెలిపారు.

ఇక క్లైమాక్స్ లో విజువల్స్ ఎలా ఉండాలో ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానని, ఇక దేవత ఆవహించినప్పుడు వారు చేసే ఓ అనే శబ్దం నేను అరిచిన శబ్దమేనని ఈ సందర్భంగా రిషబ్ శెట్టి ఈ సినిమా విశేషాలను తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube