పూజ చేశాకే కాంతార షూటింగ్ మొదలు పెట్టేవాన్ని.. రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.
ఈ సినిమా సెప్టెంబర్ 30న కనడంలో విడుదలైంది.అనంతరం ఈ చిత్రాన్ని అక్టోబర్ 15వ తేదీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.
తెలుగులో కూడా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ విధంగా ఈ చిత్రం అన్ని భాషలలో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
ఈ సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రిషబ్ శెట్టి ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
కాంతార సినిమాలో పంజుర్లీ దేవత గురించి ప్రత్యేకంగా చూపించారు.మనశ్శాంతి కోసం ఆ దేవతను తనకి ఇవ్వమని ఒక రాజు అడగడంతో ఆ ప్రజలు ఆ దేవతను రాజుకు ఇవ్వడం వారి మధ్య భూ ఒప్పందం వంటి ఎన్నో అంశాలతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
"""/"/
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హీరో రిషబ్ శెట్టి పంజుర్లీ దేవత గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
తాను వ్యక్తిగతంగా కూడా పంజుర్లీ దేవతను ఎంతగానో విశ్వసిస్తానని ఈయన తెలిపారు.ఇక ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ప్రతిరోజు కూడా ఉదయం పంజుర్లీ దేవతను పూజించిన తర్వాత ఆమెకు పూజ చేసిన అనంతరమే సినిమా షూటింగ్ ప్రారంభించే వాన్ని అంటూ ఈ సందర్భంగా రిషబ్ శెట్టి పేర్కొన్నారు.
ఇక చిన్నప్పటినుంచి తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆచారాన్ని కల్లారా చూస్తూ పెరిగాను.
ఇలా తన గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగానే ఈ సినిమా సిద్ధం చేసుకున్నానని తెలిపారు.
ఇక క్లైమాక్స్ లో విజువల్స్ ఎలా ఉండాలో ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానని, ఇక దేవత ఆవహించినప్పుడు వారు చేసే ఓ అనే శబ్దం నేను అరిచిన శబ్దమేనని ఈ సందర్భంగా రిషబ్ శెట్టి ఈ సినిమా విశేషాలను తెలిపారు.