పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి నటి రేణు దేశాయ్( Pawan Kalyan Ex Wife Renu Desai )తాజాగా టైగర్ నాగేశ్వరరావు (T iger Nageswararao ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా అక్టోబర్ 21 తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా రేణు దేశాయ్ వరుస సినిమా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు తాను పుట్టడమే తల్లి ప్రేమకు నోచుకోలేకపోయాను అని ఈమె తెలియజేశారు.
తన తండ్రి కొడుకు పుడతారని చాలా ఆత్రుతగా ఎదురు చూశారట అయితే నేను పుట్టడంతో మూడు రోజులపాటు తన తండ్రి తన మొహం కూడా చూడలేదు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.
ఇలా తన తండ్రి నాపట్ల ఎంతో చులకనగా ఉండేవారని చాలామంది తల్లిదండ్రులు కొడుకు పుట్టలేదని ఆడపిల్లలను చంపేస్తూ ఉంటారు.అయితే నా తల్లిదండ్రులు ఆ పని మాత్రం చేయలేదని ఈమె తెలియజేసారు.నేను మా ఇంట్లో పని వాళ్ళ పెంపకంలో పెరిగానని ఈమె ఎమోషనల్ అయ్యారు.
ఇక పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన జీవితం ఇబ్బందికరంగానే మారిందని విడాకులు( Renu Desai Divorce ) తీసుకోవడం ఎంతో బాధాకరం అంటూ ఈమె తెలియజేశారు.ఇక పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తాను మరో పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే విషయాన్ని కూడా ఈ వెల్లడించారు.
నాకు పెళ్లి( Marriage ) అనే కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టమని అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మరొక వ్యక్తితో నిశ్చితార్థం( Engagement ) జరుపుకున్న తాను పెళ్లి చేసుకోలేదు నాలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు అన్న ఉద్దేశంతోనే తాను నిశ్చితార్థం జరుపుకున్న పెళ్లి మాత్రం చేసుకోలేదని అయితే మరొక మూడు సంవత్సరాలలో నా పిల్లలు సెటిల్ అవుతారు.అప్పుడు తప్పకుండా తాను రెండో పెళ్లి( Second marriage ) చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా నేను దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకుల గురించి అలాగే తన రెండో పెళ్లి గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.