పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి నటి రేణు దేశాయ్ (Renu Desai) తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈమె టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అదేవిధంగా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు.ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాల గురించి స్పందిస్తూ ఉంటారు.
అయితే తాజాగా ఈమె మీడియా సెలబ్రిటీల గురించే రాసే రాతలను పూర్తిగా తప్పుపట్టారు.మీడియాలో పెద్ద ఎత్తున సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి.
ఈ వార్తలపై రేణు దేశాయ్ స్పందిస్తూ ఘాటుగా విమర్శలు చేశారు.యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటివి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల(Personal Life) గురించి ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారు.అభ్యస కామెంట్స్ కనుక చూస్తే సమాజంలో ఇంత నెగిటివిటీ ఉందా అన్న సందేహం వస్తుందని ఈమె తెలిపారు.క్రియేటివ్ పీపుల్ సినిమాలు చేయడం మానేస్తే పాటలు రాయడం మానేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.
ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి పిచ్చి రాతలు రాయడం జర్నలిజం( Journalism ) కాదు.
ఇలా సెలబ్రిటీలు పడే బాధలు వారి వ్యక్తిగత విషయాల గురించి రాస్తూ డబ్బులు సంపాదించడం మంచి పద్ధతి కాదు అని ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది ఇక ఈ పోస్ట్ పై చాలా నెగిటివ్ కామెంట్లు కూడా వస్తాయని నాకు తెలుసు కానీ ఏది తప్పో ఏది రైట్ అనేది మీకు తెలుసు అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఇలా చేసే పోస్టుల పట్ల కొన్నిసార్లు నెగిటివిటీ కూడా ఎదురవుతూ ఉంటుంది.పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈమెను కొన్ని విషయాలపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు.