రిలయన్స్‌ గ్రూప్ కొత్త వ్యాపారం.. ఇకపై ఆ ప్రొడక్ట్స్‌ పొందొచ్చు!

దేశీయ బిజినెస్ దిగ్గజం రిలయన్స్‌ గ్రూప్‌ తాజాగా ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ విక్రయించడాన్ని మొదలు పెట్టింది.ఈ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ ప్రొడక్ట్స్‌కి ఇండిపెండెన్స్‌ అనే బ్రాండ్ నేమ్ పెట్టింది.

 Reliance Group's New Business.. Now You Can Get Those Products, Business News ,-TeluguStop.com

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ బ్రాండ్‌ను మొదటగా తీసుకొచ్చారు.డిసెంబర్ 16న నిర్వహించిన ఒక ఈవెంట్‌లో ఈ కొత్త బ్రాండ్‌ను ప్రారంభించారు.

రిలయన్స్ కంపెనీ రిఫైన్డ్‌ ఫుడ్స్‌, పాలు, పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను ఇండిపెండెన్స్‌ బ్రాండ్ నేమ్‌తో అమ్ముతుంది.రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కి చెందిన రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ఈ సరికొత్త బ్రాండ్‌ను లాంచ్ చేసింది.

ఈ కొత్త బ్రాండ్ లాంచ్ సందర్భంగా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ మాట్లాడుతూ వంట నూనెలు, పప్పులు, తృణ ధాన్యాలు, బిస్కెట్లు వంటి ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌తో పాటు ఇతర నిత్యావసర సరకులను ఈ బ్రాండ్‌పై అమ్ముతామని వెల్లడించారు.క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండానే తక్కువ ధరల్లో ప్రొడక్ట్స్‌ను ప్రజలకు విక్రయిస్తామని ఆమె అన్నారు.

మరికొన్ని నెలల్లో గుజరాత్‌ రాష్ట్రమంతటా తమ కొత్త బ్రాండ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.తర్వాత ఇండియా వైడ్ గా ఈ బ్రాండ్‌ను విస్తరిస్తామని తెలిపారు.నిజానికి రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 12,000 స్టోర్‌లను కలిగి ఉంది.ఇది భారతదేశంలోని అతిపెద్ద రిటైలర్‌లలో ఒకటి.అయితే, కొత్త బ్రాండ్ అనేది తయారీదారులు, కిరానాతో సహా వాణిజ్య భాగస్వాములతో జతకట్టి ఉత్పత్తులను తీసుకొస్తుంది.ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో ప్రస్తుతం ఐటీసీ గోద్రెజ్‌, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube