తెలంగాణభవన్ లో మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థుల తొలి జాబితాను ఆయన విడుదల చేయనున్నారు.
ఫస్ట్ జాబితాలో గులాబీ బాస్ సుమారు 96 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలో తొలి జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
సిట్టింగ్ లకు సీటు వస్తుందో లేదో అన్న టెన్షన్ నెలకొందని తెలుస్తోంది.కొన్ని నియోజకవర్గాల్లో కొందరు నేతల మధ్య వర్గపోరు, మరి కొంతమంది నేతల మధ్య అసంతృప్తి నెలకొనడంతో ఎవరి పేర్లు జాబితాలో ఉంటాయన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.
కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.