మౌనమే సమాధానం అంటున్న పవన్!

ఏ రాజకీయ పార్టీ అయినా అవ్వడానికి ఒక్కరి తోనే మొదలైనా అందులో కొన్ని లక్షలమంది ఆశలు, ఆశయాలు నమ్మకాలు పెట్టుబడి గా ఉంటాయి.వ్యక్తిగతంగా తమకు ప్రయోజనం కలగకపోయినా తాము నమ్మిన లేదా తమకు నచ్చిన పార్టీ ఎదుగుదల కోసం నిరంతరం తపించే నికార్శయిన కార్యకర్తలకు భారతదేశం( India ) లో లోటు ఉండదు.

 Reason Behind Janasena Pawan Kalyan Silence,pawan Kalyan,janasena,tdp Janasena A-TeluguStop.com

తమకు కనీస అవసరాలు తీరకపోయినా తాము నమ్మిన నాయకుడు అధికారంలోకి వస్తే తమ బతుకులు మారుతాయి అని ఆశతో కొందరు , తమ సామాజిక వర్గ నేత అందలం ఎక్కితే తమకి గౌరవం దక్కుతుందన్న ఆశలతో ఆశలతో మరికొందరు ఇలా ఎవరి లక్ష్యాలతో వారు పార్టీలకు మద్దతు ఇస్తూ ఉంటారు.పార్టీలు కూడా సాదారణం గా తమను బలపరుస్తున్న నాయకుల లేదా మెజారిటీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది.

మరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వారు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఓదార్చాల్సిన బాధ్యత కూడా ఆయా పార్టీల నాయకులు పైనే ఉంటుంది.ఎందుకంటే పార్టీ అధికారం లోకి వస్తే దాని ఫలాలను ఈ నాయకులు అనుభవిస్తారు కాబట్టి .

Telugu Chandrababu, Janasena, Pawan Kalyan, Tdpjanasena, Tdp, Ys Jagan-Politics

అయితే జనసేన పార్టీ( Janasena Party ) మాత్రం ఆ సంప్రదాయాలను పక్కన పెట్టినట్టే కనిపిస్తుంది.ముఖ్యంగా తెలుగుదేశంతో పొత్తు( TDP Janasena Alliance ) ప్రకటించిన తర్వాత కార్యకర్తల లో రేగిన అసంతృప్తిని పార్టీ ఒక మీటింగ్ తో సరిపెట్టింది.ఆ తర్వాత కూడా పార్టీలోలుకలుకలు సద్దుమనగకపోయినా మాకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లుగా పవన్ వైఖరి ఉందని వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా తెలుగుదేశంతో పొత్తును అంగీకరించలేక పార్టీ హార్డ్ కోర్ మద్దతుదారులు పార్టీ నుంచి దూరం అవుతున్నా కూడా వారిని వారించే ప్రయత్నం కానీ కనీస ఓదార్పు ప్రకటన కూడా చేయకపోవడం బాధ్యతారాహిత్యమే అంటున్నారు మెజారిటీ రాజకీయ పరిశీలకులు .

Telugu Chandrababu, Janasena, Pawan Kalyan, Tdpjanasena, Tdp, Ys Jagan-Politics

వారాహి మొదటి మూడు యాత్రల వరకూ సరైన ట్రాక్ లో నడిచిన జనసేనాని తెలుగుదేశంతో పొత్తును మాత్రం సరిగ్గా డీల్ చేయలేదని ముఖ్యంగా ఒక పార్టీ స్టాండ్ అంటూ లేకుండా వ్యక్తిగతం గా మద్దత్తు ఇచ్చినట్టు గా కనిపించింది .తెలుగుదేశం శ్రేణులను( TDP Activists ) పూర్తి స్తాయిలో సంతృప్తి పరిచిన పవన్ సొంత పార్టీ శ్రేణులను( Janasena Activists ) మాత్రం గాలికి వదిలేసినట్టే వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి .జేబులో డబ్బులు లేకపోయినా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రతి నిర్ణయానికి మద్దతు తెలియజేస్తూ పార్టీ కార్యక్రమాలకు కోసం రాష్ట్రమంతా తిరిగి మద్దతు ఇచ్చిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు కూడా ఉండాలి.అలా లేనప్పుడు కనీసం సరైన వివరణ అయినా ఇవ్వగలగాలి .మరి ఆయన దగ్గర సమాధానం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారో తెలియదు కానీ జనసేనా ని ప్రతి ప్రశ్నకు మౌనాన్నే సమాధానంగా ప్రకటిస్తున్నారు.పొత్తు ప్రకటన తర్వాత జరిగిన అనేక పరిణామాలలో అసంతృప్తిగా మిగిలిపోయిన వేలాదిమంది కార్య కర్తలకి ఇప్పటికి పార్టీ సరైన సమాధానం చెప్పలేదు అన్నది మెజారిటీ అభిప్రాయంగా ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube